హైదరాబాద్ వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో 75 వేల డబల్ బెడ్రూం ఇండ్లు ఇప్పటికే కట్టుకుంటున్నామని…అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే వాటిని లబ్దిదారులకు ఇస్తామని మంత్రి కేటీఆర్. ఉప్పల్ నియోజికవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసారు మంత్రి కేటీఆర్. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
ఒకప్పుడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానం ఒక్కటే బాగుంటుండే, ఇప్పుడు ప్రతి చోట నిర్మిస్తున్నామని.. హైదరాబాద్ లో 3860 కోట్ల రూపాయలతో STP లు నిర్మిస్తున్నామని చెప్పారు.రూ. 460 కోట్లతో ఉప్పల్ చౌరస్తాలో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని.. 35 కోట్లతో ఉప్పల్ చౌరస్తాలో స్కై వాక్ నిర్మిస్తున్నాం… వచ్చే నెలలో నేనే ప్రారంభిస్తానని ప్రకటన చేశారు.
7300కోట్లతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం… జూన్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఉందన్నారు.కులం మతం అనే పిచ్చి, పంచాయితీ లేకుండా అందరికి పథకాలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.నిరుద్యోగ సోదరుల కోసం ఒకేసారి 90వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారన్నారు.