తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని ఆరోపించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంచిర్యాల జిల్లాలో భట్టి “హాత్ సే హాత్ జోడో” పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టేందుకే లీకేజీల పేరిట గొడవలు చేస్తున్నారని ఆరోపించారు భట్టి. తెలంగాణలో సింగరేణి సంక్షోభంలో చెక్కుకుంటుందని, వేలకోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి.
ప్రశ్నాపత్రాల లీకేజీ పై లోతైన దర్యాప్తు జలపాలని, బిజెపి, బిఆర్ఎస్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. రాబోయే ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఇక యాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి బట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు.