చేపలు ఎప్పుడు నిద్రపోతాయి..? ఈత కొట్టి అలసిపోతాయా..?

-

అక్వేరియంలో చేపల పెంపకం ఇప్పుడు చాలామంది ఇళ్లలో కామన్ అయిపోయింది. వీటిని చూసినప్పుడల్లా అవి ఈత కొడుతూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు వీటితోనే ఆడుకుంటారు. అప్పుడు ఇంకా స్పీడ్ గా ఈతకొడతాయి. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..? చేపలు అలిసిపోవా, ఈతకొట్టి మరి ఎప్పడు నిద్రపోతాయి అని. దీనిపై పరిశోధకులు ఏం అంటున్నారంటే..

అక్వేరియంలో ఉండే చేపల్లో ముఖ్యంగా గోల్డేన్ ఫిష్ ఎప్పుడు ఎంతో హుషారుగా ఈత కొడుతుంటుంది. చేపలు మనుషులలాగే నిర్ణీత సమయాల్లో పడుకుంటాయి. చాలా రకాల చేపలు రాత్రి పూట పడుకుని పొద్దున్ననంత మెలకువగా ఉంటాయి. కొన్ని రకాలు దీనికి విరుద్ధంగా రాత్రిపూట తిరుగుతూ పొద్దున పడుకుంటాయి. చేపలకి రెప్పలు ఉండకపోవడంతో.. అవి ఎప్పుడు నిద్రపోతున్నాయో మనం చూడడం కష్టం. మనకు విశ్రాంతి ఎంత అవసరమో, చేపలకు కూడా విశ్రాంతి అంతే అవసరం. చేపల కూడా విశ్రాంతి తీసుకుంటాయి.

చేపలు రోజంతా ఏ సమయంలోనైనా నిద్రపోవడం ద్వారా వాటి అలసటను తీర్చుకుంటాయి.. కొన్నిసార్లు పగలు, కొన్నిసార్లు రాత్రి పూట నిద్రిస్తుంటాయి. అయితే.. చేపలు రోజంతా చాలా సార్లు తక్కువ వ్యవధిలో నిద్రపోతాయి. కానీ నిద్రపోతున్నప్పుడు వాటి మెదడు చురుకుగా ఉంటుందట. చేపలు ఇతర జంతువులలా గాఢనిద్రలో పడుకోవు. నిద్రపోతున్న సమయంలో కూడా వాటి మెదడు యాక్టివ్‌గా పని చేస్తుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

చేపలు ఎక్కడ నిద్రిస్తాయి?
చేపలు తరచుగా నీటి కింద మాత్రమే నిద్రిస్తాయి. అక్వేరియంలో ఉంచిన చేపలు కూడా కొన్నిసార్లు ఈత కొట్టడం మానేయడం మీరు చూసే ఉంటారు. ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి. అదే అక్వేరియంలో చేపలు కొన్నిసార్లు ఒకే చోట ఒక మూలలో నిశ్చలంగా కనిపిస్తాయి. ఆ సమయంలోనూ అవి నిద్రపోతూ ఉంటాయి.

చేపలకు కనురెప్పలు ఉండవు కాబట్టి వాటి కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ.. ప్రతి చేప నిద్రించే విధానం భిన్నంగా ఉంటుంది. చాలా చేపలు లోతుగా వెళ్తాయి లేదా రాయి కింద నిద్రపోతాయి. ఇలాగే చేపలు వాటి గుడ్లను జాగ్రత్తగా చూసుకుంటూ ఈత కొడుతుంటాయి. ఒక వేళ నిద్రించినా వాటి గుడ్లపై నిఘా ఉంచుతాయని పరిశోధకులు అంటున్నారు.

మనకు అక్వేరియంలో ఈతకొట్టే చేపలు మాత్రమే తెలుసు.. కానీ వాటి ప్రపంచమే అది.. అందులోనే తింటాయి, నిద్రపోతాయి, గుడ్లుపెడతాయి. వాటని జాగ్రత్తగా చూసుకుంటాయి. భలే ఇంట్రస్టింగ్ గా ఉంది కదూ.. మీ ఇంట్లో అక్వేరియం ఉంటే ఓసారి గమనించండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version