ఆదివారం ఈ వస్తువులను అస్సలు కొనకండి.!

-

ఆదివారం అంటే చాలామందికి సెలవు దినం. ఏమైనా కొనాలన్నా ఆరోజే చూసుకుంటాం. పెండింగ్ పనులను కూడా ఆదివారమే కంప్లీట్ చేయాలి అనుకుంటారు. ఫ్యామిలీతో షాపింగ్ లాంటివి చేస్తుంటారు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..షాపింగ్ చేయడానికి కూడా చాలా నమ్మకాలు ఉన్నాయట. కొన్ని వస్తువులను ఆదివారం కొనకూడదు అంటున్నారు పండితులు. అవేంటంటే..

ఆదివారం కొనకూడదని వస్తువులు

ఇనుము..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ఇనుము కొనకూడదు. ఎందుకంటే ఆదివారం సూర్య భగవానుడి రోజు. శని దేవుడికి ఇనుము ప్రియమైనది అయితే, శని దేవుడు ,సూర్యుని మధ్య 36 సంఖ్యను పరిగణిస్తారు. కాబట్టి ఆదివారం రోజు ఇనుము కొనొద్దంటున్నారు పండితులు. కారు యాక్సెసరీలు చాలా వరకు ఐరన్‌తో ఉంటాయి. కాబట్టి ఆదివారాల్లో ఏ రకమైన ఇనుము కొనకండి.

 హార్డ్వేర్ వస్తువులు..

ఆదివారాల్లో హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేయడం మానుకోండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. అందుకే హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులు ఈ రోజు అస్సలు తీసుకోవద్దు.

 ఫర్నిచర్..

ఆదివారాల్లో ఫర్నీచర్ కూడా కొనకూడదు, దీనివల్ల ఇంట్లో పేదరికం వ్యాపిస్తుంది. సెలవురోజు కాబట్టి ఈరోజు చాలావరకు ఫర్నిచర్ తీసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు.. కానీ, ఆదివారం అస్సలు కొనకూడదని గుర్తుంచుకోండి.

గృహోపకరణాలు..

ఆదివారం ఇంట్లో వస్తువులను ఎప్పుడూ కొనకండి. ఈ కారణంగా మీ ఇంట్లో అనేక రకాల ఆటంకాలు వస్తాయట. ఇది చాలా మంది తెలియక చేస్తున్న తప్పు.

గార్డెనింగ్ యాక్సెసరీస్..

ఆదివారాల్లో తోటపని వస్తువులను కొనడం కూడా మంచిది కాదట. దీని వల్ల ఇంట్లో కూర్చున్న లక్ష్మీదేవి కలత చెంది ఇంటిని వదిలి వెళ్లిపోతుందని, దీని వల్ల చాలా డబ్బు నష్టం కలుగుతుందని అంటున్నారు.

 ఆదివారం ఏం కొనాలి..?

ఆదివారం నాడు ఎరుపురంగు వస్తువులు, పర్సులు, గోధుమలు మొదలైనవాటిని కొనుగోలు చేస్తే మంచిది. ఆదివారం ఈ వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణిస్తున్నారు.. ఆదివారం రోజు వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.
అయితే ఇలాంటి వాటిపై కొందరికి నమ్మకం ఉండదు. కొంటే ఏమవుతుంది.. మేము చాలా సార్లు కొన్నాం అనుకుంటారు. జోతిష్యశాస్త్రంలో వచ్చిన సమస్య ఏంటంటే..దేనికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వద్దు అంటే వద్దంటారు అంతే. నమ్మకం ఉన్నవాళ్లు ఫాలో అవుతారు. లేని లైట్ తీసకుని లాగించేయడమే.!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news