కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ‘ముకుల్ వాస్నిక్’… సీనియర్ నాయకుల ప్రతిపాదన

-

5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు కలిగిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఈ ఫలితాలను చూసి నిరాశకు గురయ్యారు. ఐదు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రభావం చూపకపోవడం చాలా మంది నేతలతో పాటు కార్యకర్తలను అసంత్రుప్తికి గురిచేశాయి. ఉత్తర్ ప్రదేశ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విస్త్రుతంగా ప్రచారం చేసినా… 403 స్థానాలకు కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకుంది. ఇక గెలిచే అవకాశం ఉన్న పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో నాయకులు సమర్థవంతంగా పనిచేయలేదని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. పంజాబ్ లో కాంగ్రెస్ సీఎం చన్నీతో పాటు పీసీసీ ప్రెసిడెంట్ సిద్దూ కూడా ఓడిపోవడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. జీ 23 గా పిలువబడుతున్న సీనియర్ నేతలు ఇప్పటికే సమావేశం అయ్యారు. అయితే తాజాగా వారు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ‘ ముకుల్ వాస్నిక్’ ని నియమించాలని సలహా ఇస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్లు హాజరు అవుతారా .. ? లేదా..? ఇంకా స్పష్టత లేదు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని.. పార్టీలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news