మనం తీసుకునే ఆహారం, జీవన విధానం పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలి. గుండె సంబంధిత సమస్యలు వచ్చాయంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆట్రియల్ ఫైబ్రిల్లేషన్ అంటే గుండె వేగంగా కొట్టుకోవడం, సమయానుసారం కొట్టుకోకపోవడం.
అయితే ఇటువంటి వాళ్లకి వ్యాయామం ఎలా పని చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు ఆరు నెలల పాటు వ్యాయామ ప్రోగ్రాం బాగా ఉపయోగపడిందని రీసెర్చర్లు అంటున్నారు. అదే విధంగా లక్షణాలు కూడా బాగా తగ్గాయని అంటున్నారు. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ చేసిన కొత్త ప్రకారం ఈ విషయాలు తెలుస్తున్నాయి.
లక్షణాలు:
శ్వాస సరిగా ఆడక పోవడం
కొద్దిగా తల నొప్పి
నీరసం
గుండె వేగంగా కొట్టుకోవడం
ఇర్ రెగ్యులర్ గా కొట్టుకోవడం
అయితే ఈ సమస్య ఉన్నవాళ్లకి ఈ జీవితం యొక్క నాణ్యత తగ్గుతుంది. 55 ఏళ్లు దాటిన వాళ్లకి కాస్త రిస్క్ ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్న వాళ్లకి ఫిజికల్ యాక్టివిటీ బాగా పని చేస్తుందని చాలా మటుకు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడిందని నిపుణులు చెప్తున్నారు.
అయితే ఇలా వ్యాయామం చేయడం వల్ల చాలా మార్పు కనబడిందని అంటున్నారు. అయితే ఈ రీసెర్చ్లో 120 మంది పేషంట్లని తీసుకోవటం జరిగింది ఆరు నెలల పాటు వ్యాయామ పద్ధతుల్ని పాటించారు. అయితే వీటిలో ఏరోబిక్ యాక్టివిటీ ని కూడా కొందరు సెలెక్ట్ చేసుకున్నారు. వాకింగ్, ఇండోర్ సైక్లింగ్, సిమ్మింగ్ లాంటివి. ఇలా వ్యాయామాన్ని ఫాలో అవడం వలన క్రమంగా లక్షణాలు తగ్గాయి. సమస్య కూడా చాలామటుకు తగ్గింది.