రేవంత్ రెడ్డి విషయంలో వాళ్ళు లాజిక్ మిస్ అవుతున్నారా?

-

టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి revanth reddy దూకుడుగా తెలంగాణ రాజకీయాల్లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. పీసీసీ ప్రకటన వచ్చిన దగ్గర నుంచి తనదైన శైలిలో అధికార టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో రేవంత్, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలనే గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన 12 మంది అధికార టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన విషయం తెలిసిందే.

రేవంత్ రెడ్డి/ revanth reddy

ఇక వారిని రేవంత్ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అలా పార్టీని మారిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలని మాట్లాడుతున్నారు. వాళ్ళపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అటు రేవంత్ వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2017లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో ఎందుకు చేరారో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాగే 2017లో పార్టీ మారి పదవీకాలం ముగిసే వరకు ఎమ్మెల్యేగా కొనసాగింది వాస్తవం కాదా? అని ప్రశ్నిస్తున్నారు.

అయితే ఇక్కడే టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలు లాజిక్ మిస్ అవుతున్నారని రేవంత్ అనుచరులు చెబుతున్నారు. 2017లో టీడీపీని వీడేప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని, స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి, తన గన్‌మెన్లని ఉపసంహరించుకుని, ఎమ్మెల్యేకు సంబంధించిన బ్యాంక్ ఖాతాని కూడా క్లోజ్ చేయించారని గుర్తు చేస్తున్నారు.

అయితే రాజీనామా లెటర్‌ని చంద్రబాబుకు ఇచ్చారని, టీడీపీ నుంచే గెలిచారు కాబట్టి, రాజీనామాని బాబుకు ఇచ్చారని, ఇంకా ఆయన స్పీకర్‌కు పంపుతారో లేదో ఆయన ఇష్టమని చెప్పి రేవంత్ వదిలేశారని, కానీ ఎమ్మెల్యేకి ఉంటే ప్రోటోకాల్స్ తీసుకోలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడు రేవంత్ గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచారు కాబట్టి, వారు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.

పైగా అప్పుడు రేవంత్ పదవి వదిలేసి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరారని, కానీ ఇప్పుడు అధికారం కోసం ఆశపడి టీఆర్ఎస్‌లో చేరారని కౌంటర్లు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version