అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలి లేదా ఒక మొక్క నాటాలి అని సంప్రదాయం చెపుతుంది. అక్షయతృతీయ పితృదేవతలకు తర్పణాలు విడిచినట్లయితే వారికి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది. అక్షయతృతీయ రోజున విసినకర్రలు, గొడుగు, నీళ్ళు, గోదానం చేయాలి. ఈ రోజున బంగారం కొనడం సాంప్రదాయంగా వస్తోంది.
ఈ రోజు తప్పకుండా బంగారం కొనాలని అంటారు. బంగారం కొంటే అక్షయం అవుతుందని అంటారు. అయితే వారి వారి స్తోమతను బట్టి బంగారం కొనాలి. అంతేకాని లేనిపోని ఆరాటాలకు పోయి అప్పులు చేసి బంగారం కొనవద్దు. భగవంతుడికి మనసుని అర్పించడమే బంగారం కొన్నదానికంటే ఎక్కువ. మాధవమాసంలో వచ్చే ప్రథమ పండుగ ఇది అక్షయ తృతీయ. ఈరోజు శ్రీలక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో ప్రార్థన చేస్తే అన్ని అక్షయం అని పండితులు పేర్కొంటున్నారు.