సాధారణంగా మనం ఎప్పుడైనా సరే బ్రేక్ ఫాస్ట్ లో కొన్ని రకాల పండ్లను కూరగాయలను కలిపి తింటూ ఉంటాము. అయితే నిజానికి ఇది ఆరోగ్యానికి మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ వైద్యపరంగా ఇలా ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని రకాల కాంబినేషన్లు ఆరోగ్యానికి మంచి చేయడం గురించి పక్కన పెడితే.. శరీరంలోని కొన్ని అవయవాల పనితీరును దెబ్బతీసే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక పండ్లలో కూడా కొన్ని రకాల పండ్లను కలిపి తినకూడదు అని.. కొన్ని రకాల కాయగూరలను ఇంకొన్ని రకాల పండ్లతో తినకూడదని సూచిస్తున్నారు. మరి ఆ కాంబినేషన్ లు ఏమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
కూరగాయలతో పండ్లు:
మాములుగా పిల్లలు పండ్లు , కూరగాయలు తినరని అమ్మలు వాళ్ళకి వెరైటీ గా సలాడ్స్ రూపంలో రెండింటిని కలిపి ఇస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. పండ్లు అలాగే కూరగాయలు జీర్ణం అవడానికి వేరే వేరు విధానాలను జీర్ణాశయం పాటిస్తుంది . పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, అవి ప్రేగులకు చేరే వరకు పాక్షికంగా జీర్ణమవుతాయి. ఉదాహరణకు, క్యారెట్లు మరియు నారింజలను కలిపి తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ మిశ్రమం అధిక పిత్త రిఫ్లక్స్ మరియు గుండెల్లో మంటను కూడా కలిగిస్తుంది.
తీపి పండ్లు మరియు ఆమ్ల పండ్లు:
స్ట్రాబెర్రీ మరియు ద్రాక్ష వంటి ఆమ్ల పండ్లను తినడం లేదా పీచెస్, ఆపిల్ మరియు దానిమ్మ వంటి ఆమ్ల పండ్లను అరటి వంటి తీపి పండ్లతో కలిపి తినడం వల్ల మీ జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. వీటిని కలిపి తినడం వల్ల తలనొప్పి, వికారం మరియు అసిడిటి వంటివి వస్తాయి.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి కాంబినేషన్లు ట్రై చేయవద్దు.