10 లక్షలతో మంది మోడీ బహిరంగ సభ నిర్వహిస్తామని..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. మోడీ రెండు రోజులు హైదారాబాద్ లో ఉంటారని.. బిజెపి ముఖ్య నేతలు కూడా ఇక్కడ ఉండనున్నారని వెల్లడించారు. జేపీ నడ్డా అధ్యక్షుడు అయ్యాక జరుగుతున్న మొదటి జాతీయ కార్యవర్గ సమావేశాలు అని.. హైదరాబాద్ లో జరగడం సంతోషంగా, అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.
నేతల అందరూ రెండు రోజులు ఇక్కడ ఉండడం మాకు భరోసా అని.. నయా నిజం పాలన కు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుంది .. దీటుగా పని చేస్తుంది బిజెపి అని వెల్లడించారు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించడానికి ఈ సమావేశాలు దోహద పడుతాయని.. జులై 3 న సాయంత్రం బిజెపి బహిరంగ సభ ఉంటుందని చెప్పారు.
TRS ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన తుక్కు గూడా సభను విజయ వంతం చేసుకున్నామని పేర్కొన్నారు. కార్యకర్తల నుండి నిధి నీ సేకరించి ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని.. పోలింగ్ బూత్ నుండి రాష్ట్ర,జాతీయ స్థాయి నేతలకు విరాళాలు సేకరణ చేస్తామని వివరించారు.