మీ దగ్గర 786 నెంబర్‌ కరెన్నీ నోటు ఉందా..? ఉంటే లక్షాధికారి అయినట్లే..!

-

అరుదైన వాటికి మార్కెట్‌లో డిమాండ్ బాగా ఉంటుంది. కొన్నిసార్లు వాటిని కొనేందుకు ఎంతైనా వెనకాడరు. ఈ నెంబర్‌ గల కాయిన్స్‌ మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే లాంటి వార్తలను మనం వినే ఉంటాం. ఇది కూడా అదే బాపతి.. ముస్లింలకు ఎంతో ఇష్టమైన..786 నెంబర్.. ఈ నెంబర్‌ను వారు సెంటిమెంట్‌గానే కాదు లక్కీగా కూడా భావిస్తారు. అరబిక్‌లో ‘బిస్మిల్లా అల్-రెహమాన్ అల్-రహీమ్’ అనే పదానికి ఇది న్యూమరాలజీ నంబర్. లక్కీ నంబర్‌గా భావిస్తారు. ఇక హిందువులు మాతా వైష్ణోదేవి చిత్రాన్ని ముద్రించిన నాణేలను కూడా అదృష్టంగా భావిస్తారు. అందుకే ఇప్పుడు ఈ 786 నంబర్‌తో కూడిన కరెన్సీ నోట్లకు, మాతా వైష్ణోదేవి చిత్రంతో కూడిన నాణేలకు ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. వీటి కోసం లక్షల రూపాయలు వెచ్చించేందుకు కూడా కొందరు వెనుకాడట్లేదు. మరి అలాంటి నోట్లు, నాణేలు మీ దగ్గర ఉంటే..!

మీవద్ద 786 నంబర్ కరెన్సీ నోట్ ఉందా?

మీవద్ద 786 నంబర్‌తో కూడిన కరెన్సీ నోటు ఉంటే eBay వెబ్‌సైట్‌లో దాన్ని అమ్మకానికి పెట్టవచ్చు. ఇలాంటి కరెన్సీ నోట్లు రూ.3 లక్షల వరకు పలుకుతున్నాయి. eBayలో ఇలాంటి అరుదైన నోట్లను కొనుగోలు చేసేందుకు కొంతమంది భారీ మొత్తంలో వెచ్చిస్తున్నారు. కాబట్టి మీవద్ద ఈ నోటు ఉన్నట్లయితే ఎలా విక్రయించాలో చూద్దాం..

Ebay.com లో పాత కరెన్సీ నోట్లను ఎలా విక్రయించాలంటే..

1: www.ebay.com ఓపెన్ చేయండి

2: హోమ్‌పేజీలో రిజిస్టర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి.

3: రిజిస్టర్ అయ్యాక మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవండి.

4 : మీవద్ద ఉన్న కరెన్సీ నోటును ఫోటో తీసి ఈబేలో అప్‌లోడ్ చేయండి.

5: నోట్‌ని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు మీ ప్రకటనను చూసి మిమ్మల్ని సంప్రదిస్తారు.

మాతా వైష్ణో దేవి నాణేం ఉంటే..

కాయిన్ బజార్ అనే వెబ్‌సైట్‌లోనూ పాత, అరుదైన కరెన్సీ నోట్లను విక్రయించుకోవచ్చు… పాత రూ.1, రూ.2, రూ.5 నోట్లు కొన్ని షరతులతో లక్షల రూపాయాలు పలుకుతున్నాయి. మీ వద్ద మాతా వైష్ణో దేవి చిత్రంతో కూడిన రూ.5, రూ. 10 నాణేలు ఉంటే మీరు వాటిని వేలానికి పెట్టి లక్షల రూపాయలు సంపాదించేయొచ్చు.. ఈ నాణేలను ప్రభుత్వం 2002లో విడుదల చేసింది, వీటికిప్పుడు చాలా డిమాండ్ ఉంది.

పాత రూపాయి నోట్లకు..

పాత రూపాయి నోటుకు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. మీవద్ద రూ.1 నోటు వారి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే..రూ.45 వేలు వరకు పొందవచ్చు. ఆ నోటు..1977-1979 నాటి పాత రూపాయి నోటు అయి ఉండాలి. దానిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ హిరూభాయ్ ఎం పటేల్ సంతకం ఉండాలి.

మరి ఇలాంటివి మీ దగ్గర ఉంటే..మోసపోకుండా సేల్‌ చేయండి..! విక్రయించేప్పుడు జాగ్తత్త.. సైబర్‌ మోసాలకు గురికాకుండా స్టప్‌ తీసుకోండి.!

Read more RELATED
Recommended to you

Latest news