తెలుగు చిత్ర పరిశ్రమ లోకి మొట్టమొదటిగా అడుగుపెట్టింది అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక తన నటనతో, వైవిద్య భరితమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన అక్కినేని నాగేశ్వరరావు కెరియర్ తొలినాళ్లల్లో రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఇక తన దూకుడికి తగ్గట్టుగా మరో హీరో ఎవరైనా వస్తే బాగుండు అని ఆలోచిస్తున్న నేపథ్యంలోని ఎన్టీఆర్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా చలామణి అయ్యారు. ఇక సాంఘిక , పౌరాణిక , జానపద వంటి చిత్రాలతో కలసి నటించిన ఎన్టీఆర్ కు, ఏఎన్నార్ అంటే విపరీతమైన అభిమానం ఉండేది . ఇక అభిమానంతోనే వీళ్లిద్దరూ కలిసి ఎన్నో మల్టీ స్టార్లర్ చిత్రాలను కూడా తెరకెక్కించారు.
ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ విడి విడి గా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే థియేటర్లలో ప్రేక్షకుల హంగామా అంతా ఇంతా ఉండేది కాదు. అలాంటిది వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా విడుదలవుతోంది అంటే వారం రోజుల ముందు నుంచే థియేటర్ల మధ్య సందడి మొదలయ్యేది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక మల్టీ స్టారర్ సినిమాలకు పెట్టింది పేరుగా వీరిద్దరూ మిగిలిపోయారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తరికెక్కించిన ఎన్నో సినిమాలలో దానవీరశూరకర్ణ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో కృష్ణుడి వేషం కోసం ఏఎన్ఆర్ ను సంప్రదించగా అందుకు అంగీకరించలేదు. ఇక మరేపాత్రైనా చేయమని అడిగితే అప్పటికి కూడా ఏఎన్నార్ అంగీకరించకపోయేసరికి ఎన్టీఆర్ స్వయంగా మూడు నాలుగు పాత్రలు వేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇకపోతే అప్పటినుంచి కోల్డ్ వార్ జరిగింది.
అయితే వీరిద్దరి మధ్య గొడవలకి ఒక నటుడు బలయ్యాడు అని చెప్పవచ్చు. నిజానికి ఆయన ఎవరో కాదు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న గుమ్మడి. ఎన్టీఆర్ నటించిన సినిమాలలో గుమ్మడి ఎక్కువగా నటించాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య గొడవలు ఉన్న సమయంలో ఏఎన్ఆర్ సినిమాలలో ఎక్కువగా గుమ్మడి నటించడంతో.. ఎన్టీఆర్.. గుమ్మడి , ఏఎన్ఆర్ మనిషి అనుకోని గుమ్మడి కూతురు పెళ్లి కూడా వెళ్లలేదు ఎన్టీఆర్. ఇక తర్వాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి పోవడంతో తన తప్పు తెలుసుకున్న ఎన్టీఆర్ గుమ్మడిని ఆదరించడం జరిగింది.