రఘురామపై విజయసాయి ఫైర్‌..పవన్ కళ్యాణ్‌ వీడియో పెట్టి మరీ !

-

‘బ్లాక్ డాగ్’, గుంట నక్క అంటూ రఘురామపై విజయసాయి ఫైర్‌ అయ్యారు. ‘బ్లాక్ డాగ్’ బ్రాండును కొత్తగా తెచ్చాడు గుంట నక్క. రేయింబవళ్ళు తాగి, తూలే వీడు…మధ్యలో స్క్రిప్ట్ చదివి, కామెడీ స్కిట్లు చేసి పడుకుంటాడు. ఎల్లో మీడియాను ఎవరూ చూడటం లేదని హాస్యనటులతో షోలు పెట్టి రేటింగులు పెంచాలనుకుంటున్నావా కుట్రల బాబూ? అంటూ ఆగ్రహించారు విజయసాయిరెడ్డి.

ప్రజానాడి తెలియకుండా ఇన్నాళ్లు పాపి నాయుడి కళ్లకు గంతలు కట్టిన పచ్చ కుల మీడియాకు ప్లీనరీలో జనాన్ని చూసి కళ్లు బైర్లుకమ్మాయి. డెకాయిట్ బాబుకి మైండ్ బ్లాంక్ అయింది. రాష్ట్రంలో సై’కిల్ ను తుక్కు తుక్కు చేసిన ప్రజలకు ప్లీనరీ ముగింపు సందర్భంగా అభినందనలు చెప్పారు.

అత్యంత ఘనంగా, ఉల్లాసంగా, ఉద్వేగభరిత వాతావరణంలో జరిగిన ప్లీనరీ విజయవంతమైతే పచ్చకుల మీడియా పేజీల కొద్దీ విషం గుమ్మరించింది. ప్రింటింగ్ ఇంక్ బదులు ‘సయనైడ్’ను ముద్రణకు వాడింది. మీ ఆలోచనలు ఎలా ఉంటాయో మీ భవిష్యత్తు అలాగే ఉంటుంది. ఏడుస్తూ, నిద్రపట్టక కృశించి చస్తార్రా!అంటూ నిప్పులు చెరిగార విజయసాయి.

Read more RELATED
Recommended to you

Latest news