వామ్మో… ఎన్టీఆర్‌ అన్ని భాషల్లో మాట్లాడగలరా?

-

నటన, డైలాగ్స్, డ్యాన్స్​, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్​ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్​లోని అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అనర్గళంగా ఎన్ని భాషల్లో మాట్లాడగలరో తెలుసా?

నందమూరి నట వారసుడిగా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు తారక్​. పదేళ్ల వయసులోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర(1991)తో బాల నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడే తాతను పోలిన రూపంలో కనిపించడంతో అంతా జూనియర్‌ ఎన్టీఆర్‌ అని పిలిచేవారు. అదే ఆయన స్క్రీన్‌ నేమ్‌గా స్థిరపడింది.

రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం.. ఇలా నవరసాలను అలవోకగా పండించగలిగే నటుల్లో ఆయన ఒకరు. అందుకే ‘నటనలో నీ తర్వాతే ఎవరైనా’ అని అంటారు ఆయన సినిమాలను చూసిన వారందరూ. సింగిల్‌ టేక్‌లో భారీ సంభాషణలు చెప్పదగ్గ, అదిరిపోయే స్టెప్పులు వేయగలిగే నటుడాయన. గుక్క తిప్పుకోకుండా భారీ డైలాగ్స్ చెప్పడంలో ఎన్టీఆర్​కు సరిసాటి ఎవరూ రాలేరు. డైలాగ్ డెలివరీ గాని, డాన్స్​లో జోష్, ఫైట్స్​లో ఎన్టీఆర్ స్పీడ్​కు సిల్వర్​స్క్రీన్​ సైతం ఊగిపోవాల్సిందే.

కెరీర్​ల ఆరంభంలోనే ఆది, సింహాద్రి చిత్రాలతో మాస్ హీరోగా ప్రేక్షకుల మనసును కొల్లగొట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రాల సక్సెస్​తో ఎన్నో అవకాశాలను అందుకొని స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్​గా నటించి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే ఎన్టీఆర్​లో నటన మాత్రమే కాకుండా ఇంకా మరెన్నో టాలెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి అనేక భాషల‌ు మాట్లాడడం. సాధారణంగా హీరోలు తమ ప్రాంతీయ భాషతో పాటు హిందీ లేదా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇంకొంతమంది సౌత్​ హీరోలైతే ప్రాంతీయ భాషతో పాటు మరో రెండు దక్షిణాది భాషలను మాట్లాడగలతారు. కానీ ఎన్టీఆర్​ మాత్రం అనర్గంలా దాదాపు తొమ్మిది భాషలు మాట్లాడతారట. వీటిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్​, స్పాన్​ ఉన్నాయి. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఓ పొలిటీషియన్​ కూడా చెప్పారు. కాగా, ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లోనూ ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే అక్కడి భాషలో మాట్లాడి సైతం ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్​.. తమ అభిమాన హీరో ఇన్ని భాషల్లో మాట్లాడతారా అని తెలుసుకుని తెగ సంబరపడిపోతున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్​.. కొరటాల శివ, ప్రశాంత్​ నీల్​తో కలిసి రెండు భారీ సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే తారక్​ పుట్టినరోజు సందర్భంగా వాటికి సంబంధించిన అప్డేట్స్​ కూడా వచ్చాయి. అవి త్వరలోనే సెట్స్​పైకి వెళ్లనున్నాయి. ప్రస్తుతం ఈ మూవీస్​ కోసం తన మేకోవర్​ చేంజ్​ చేసే పనిలో బిజీ అయ్యారాయన.

Read more RELATED
Recommended to you

Latest news