టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ‘పెళ్లి సందD’ చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ప్రజెంట్ ఆయన పలు సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుండటంతో పాటు పలు సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని మహేశ్ బాబు వరకు అందరు హీరోలతో సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. సరైన కథ దొరికితే ఇప్పుడు కూడా సినిమా తీసేందుకు రెడీగా ఉన్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. అప్పట్లోనే మాస్ మహారాజ రవితేజ ..ఆయన దర్శకత్వంలో పని చేశాడు. ఆ సినిమా ఏంటి? రవితేజ పోషించిన పాత్ర ఏంటి ? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన మ్యూజికల్ ఫిల్మ్ ‘అల్లరి ప్రియుడు’. యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ ఇందులో లవర్ బాయ్ గా కనిపించారు. ఈ సినిమాలో రవితేజ చిన్న పాత్ర పోషించారు. రాజశేఖర్ పక్కన చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా రెండొందల రోజులు ఆడటం విశేషం.
‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో రవితేజ నటించిన సంగతి ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు తెలిపారు. తన దర్శకత్వంలో వచ్చి 200 రోజులు ఆడిన ఫిల్మ్ లో రవితేజ చిన్న పాత్రలో కనిపించడం తనకు గౌరవమని పేర్కొన్నారు దర్శకేంద్రుడు.
రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రంలో త్వరలో విడుదల కానుంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపైన భారీ అంచనాలున్నాయి. రవితేజ గత చిత్రాలు ‘ఖిలాడీ’, ‘రామారావు..ఆన్ డ్యూటీ’.. రెండూ కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు.