బీరకాయ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?

-

మనలో చాలామంది బీరకాయ కూర అనగానే ముఖం చాటేస్తూ ఉంటారు.చాలామంది దృష్టిలో బీరకాయ ఒక పనికిరాని కూర,అయితే బీరకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని మాత్రం వారికి తెలియదు.అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

బీరకాయలో ఉండే లక్షణాలు చక్కెర వ్యాధులు నివారించడంలో చాలా అద్భుతంగా సహాయపడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్,యూరిన్ లోని షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతాయి.

బీరకాయ చాలా సులువుగా జీర్ణం అవుతుంది. అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో అత్యంత ప్రభావంతంగా పనిచేస్తుంది.మొలల వ్యాధితో బాధపడే వారికి బీరకాయ చాలా మంచిని చేస్తుంది.

బరువు తగ్గాలని అనుకునే వారికి తమ డైట్ లో బీరకాయను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇందులో ఫ్యాట్ మరియు కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటాయి. బీరకాయలో నీటి శాతం మరియు పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల త్వరగా ఆకలి వేయదు.

బీరకాయ ఎలాంటి అనారోగ్యాలకైనా గురైనప్పుడు చాలా త్వరగా కోలుకునేలా చేస్తుంది. ఇది జీవక్రియలు చురుగ్గా పనిచేసేలా చేసి, త్వరగా శరీరం కోలుకునేలా చేస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లు,వైరస్లు సోకకుండా చేసి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చర్మ ఆరోగ్యానికి బీరకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంపై పేరుకుపోయిన మృతకనాలను తొలగించే అద్భుత మూలకం ఇందులో ఉంది. ఇది మొటిమలు,చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగించి ముడతలు లేని యవ్వనవంతమైన చర్మాన్ని తిరిగి ప్రసాదిస్తుంది.

బీరకాయ ఉదర ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో మంట గ్యాస్, అసిడిటీ వంటి ఉదర సమస్యలను తగ్గిస్తుంది.ఇందు లో అధికంగా ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి,జీర్ణక్రియ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.

అలాగే బీరకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం మొత్తాన్ని శుద్ధి చేసి, శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అలాగే ఇందులో ఉండే బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news