మనం కొనే వస్తువులకు బ్రాండ్, కాలపరిమితి చూడటమే మనకు అలవాటు. కానీ వాటిపై ఉండే రంగులను మనం పెద్దగా పట్టించుకోం. యట్రాక్షన్ కోసం వేసి ఉంటారులే అనుకుంటాం. ప్యాకింగ్ అంతా ఉండే కలర్ పక్కనపెడితే.. స్పెషల్ గా కొన్ని కలర్ డాట్స్ ఉంటాయి. వాటిని ఎప్పుడైనా గమనించారా.. అసలు వాటి అర్థం ఏంటో తెలుసా.!
టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై వివిధ రంగుల కలర్ బ్లాక్‌లను తయారు చేస్తారు. ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు ఉంటాయి. ఈ రంగులకు ఒక్కో దానికి ఒక్కో మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కు సింబాలిక్ గానే.. ఇలా ఆయా రంగులు వేస్తుంటారట.
టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై చేసిన రెడ్ కలర్ కు మీనింగ్ ఏంటంటే.. ఈ రంగు ఉంటే ఈ టూత్‌పేస్ట్ సహజ, రసాయన పదార్థాలను కలపడం ద్వారా తయారు చేయబడిందని అర్థం. మీరు సహజమైన వస్తువులతో తయారుచేసిన టూత్‌పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించాలని అనుకుంటే.. ఈ కలర్ ఉన్నది వాడకండి.
టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై ఆకుపచ్చ రంగు బ్లాక్.. ఉంటే అది సహజమైన పదార్థాలతో మాత్రమే తయారు చేసారని అర్థం.. మీకు రసాయన పదార్థాలు నచ్చకపోతే ఈ రకమైన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం బెటర్.
ఇక బ్లాక్ కలర్ ఉంటే ఈ టూత్‌పేస్ట్ రసాయనాల నుండి మాత్రమే తయారు చేసినట్లు.
ట్యూబ్‌పై బ్లూ కలర్ బ్లాక్ ఉంటే.. అది సహజ పదార్థాలు, ఔషధాల నుండి తయారు చేయబడిందని మీనింగ్. ఒక నిర్దిష్ట పరిస్థితిలో ఈ రకమైన పేస్ట్‌ను ఉపయోగించమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల, దానిని ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోవాలట.
దీన్ని బట్టి మనం ఇప్పుడు ఏది వాడాలో డిసైడ్ అవ్వాలి. బ్రాండ్ నేమ్ పక్కనపెట్టి. అందులో రసాయనాల వాడకాన్ని బట్టి టూత్ పేస్ట్ డిసైడ్ చేసుకోవడం మంచిది. ఇప్పటికే మనం తెలిసి తెలియక చాలా కెమికల్ ఫుడ్స్ తింటున్నాం. తెలిసిన కొన్నింటిని అయినా దూరం పెడితే.. ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే కదా..!
-Triveni Buskarowthu