పవన్ వారాహి రిజిస్ట్రేషన్ ఖర్చు ఎంతో తెలుసా..?

-

తాజాగా పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో బిజీగా పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వారాహి అనే ఒక వాహనాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. అయితే ఈ వెహికల్ వచ్చినప్పుడు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం నడిచింది . ముఖ్యంగా ఈ వాహనం రంగు మిలిటరీ ఆలివ్ గ్రీన్ అని.. ఇలాంటి రంగులు ప్రైవేటు వాహనాలకు వినియోగించుకోకూడదు అంటూ అధికార నేతలు ప్రశ్నించారు.

అయితే తాజాగా వారాహి వాహనానికి నంబర్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తయిందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ వారాహి TS 13 EX 8384 పేరుతో వారాహిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. తాజాగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు ఇంటర్వ్యూలో పాల్గొని వారాహి వాహనం గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ వాహనానికి ఆలివ్ గ్రీన్ ఉపయోగించలేదని.. అది ఎమరాల్డ్ గ్రీన్ అని ఆయన తెలిపారు. ఈ వెహికల్ బాడీ బిల్డర్ ఇచ్చిన సర్టిఫికెట్ పరిశీలించిన అనంతరమే పర్మిషన్ ఇచ్చినట్టు కూడా స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ కోసం నిబంధనలకు అనుగుణంగా డబ్బుని చెల్లించి ఈ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పాపారావు వెల్లడించారు. అయితే ఈ నెంబర్ రిజిస్ట్రేషన్ కోసం రూ.5000 ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్ తీసుకున్నారు. సాధారణంగా స్పెషల్ నంబర్స్ అనేవి అంత ఈజీగా ఎవరికి అలర్ట్ కావు. అలాంటివి కావాలంటే ప్రభుత్వానికి రూ.5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్ తీసుకోవచ్చు. ఈ క్రమంలోని వారాహికి కూడా రూ.5000 కట్టి 8384 అనే రిజిస్ట్రేషన్ నెంబర్ పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news