సమంత బాధపడుతున్న ఆటో ఇమ్యూన్ వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసా..?

-

టాలీవుడ్ లోకి మొదట ఏం మాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు పొందింది. తన మొదటి సినిమాతోనే నాగచైతన్యతో ప్రేమలో పడి తనని వివాహం చేసుకొని అక్కినేని కోడలుగా పేరు సంపాదించింది. అయితే కొన్ని కారణాల చేత గత ఏడాది విడిపోవడం జరిగింది. సమంత – నాగచైతన్య విడిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయం ఇప్పటికీ క్లారిటీ లేదని చెప్పవచ్చు. ఇక సమంత ఆరోగ్యం పై గత కొద్దిరోజులుగా ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా సమంత ఈ విషయంపై స్పందిస్తూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

ఇక సమంత పోస్ట్ చేస్తూ.. తాజాగా యశోద సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తన పైన చూపిస్తున్న అభిమానానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొస్తూ.. గత కొద్ది నెలలుగా తాను ఆటో ఇమ్యూన్ సమస్యతో బాధపడుతున్నానని.. దీనినే మయోసైటిస్ గా పరిగణిస్తారని తెలియజేసింది. అంతేకాకుండా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని మొదట అనుకున్నంత వేగంగా ఈ చికిత్స పూర్తి అయ్యేలా కనిపించలేదని సమంత ఎమోషనల్ అవుతూ తెలియజేసింది.

అయితే వైద్యులు మాత్రం తనకు వైద్య చికిత్స అందిస్తున్నారని.. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో అభిమానుల ముందుకు వస్తానని సమంత తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది. మరి సమంత ఎదుర్కొంటున్న ఆటో ఇమ్యూన్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో నిపుణులు తెలిపిన ప్రకారం.. ముఖం మీద దద్దుర్లు రావడం.. చర్మం ఎర్రబడడం.. పొలుసులు రావడం వంటి లక్షణాలు ఎక్కువగా ఈ వ్యాధి వచ్చిన వారిలో కనిపిస్తాయి. వీటితోపాటు చర్మం మీద నల్లటి మచ్చలు ఏర్పడడం , కండరాల నొప్పులు, శరీరమంతా వాపులు, కీళ్ల నొప్పులు ఏర్పడతాయి . బరువు పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సమస్యతోనే సమంత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె మంచి చికిత్స పొంది త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Read more RELATED
Recommended to you

Latest news