రాకింగ్ రాకేశ్-సుజాతల మధ్య అసలేం జరిగింది..? రివీల్ చేసిన గెటప్ శ్రీను భార్య..!

-

‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేశ్.. ‘బిగ్ బాస్’ ఫేమ్ సుజాత లవ్ స్టోరి గురించి అందరికీ తెలుసు. ‘జబర్దస్త్’ లో ఓ స్కిట్ ద్వారా మొదలైన వీరి లవ్ స్టోరి.. చివరి దశకు అనగా మ్యారేజ్ వరకు ఎప్పుడు చేరుకుంటుందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవల కాలంలో రాకింగ్ రాకేశ్-బిగ్ బాస్ సుజాత మధ్య గొడవ జరిగింది. ఓ విషయమై సుజాత..రాకేశ్ పైన చాలా కోపంగా ఉందట. ఆ విషయం ఏంటో తెలుసుకోవడం కోసం గెటప్ శ్రీను భార్య సుజాత తన యూట్యూబ్ చానల్ సుజి శ్రిన్ ద్వారా …సుజాతను తీసుకుని రాకేశ్ వద్దకు వెళ్లింది. అసలు వీరి పెళ్లి ఎప్పుడనే సంగతి కూడా గెటప్ శ్రీను భార్య అడిగింది. ఆ ప్రశ్నకు సుజాత, రాకేశ్ ఏం చెప్పారో తెలుసుకుందాం.

 

ఇంతకీ రాకింగ్ రాకేశ్- సుజాత మధ్య ఏం జరిగిందనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. నిజంగానే వీరిరువురు గొడవపడ్డారా? అనేది తెలుసుకునేందుకు గెటప్ శ్రీను భార్య ప్రయత్నించింది. ఇక ఈ వీడియోలో తను ఫోన్ చేస్తే రాకింగ్ రాకేశ్ అసలు ఫోన్ ఎత్తడం లేదని బిగ్ బాస్ సుజాత.. కంప్లయింట్ చేస్తుంది. ఓ విషయమై తాను విపరీతంగా బాధపడుతున్నానని అంటుంది. మధ్యలో అసలేంటా? విషయం తనకు అసలేమీ తెలియదని రాకింగ్ రాకేశ్ చెప్తుంటాడు.

‘నువ్వు అట్ల చెసుడు తప్పబ్బ’ అంటూ పదే పదే ‘బిగ్ బాస్ ’సుజాత.. రాకింగ్ రాకేశ్ ను ఉద్దేశించి అంటోంది. అయితే, తాను తన మూవీ..‘ఊఅంటారా మామ..ఊఊ అంటారా మామా’ షూటింగ్ లో బిజీగా ఉన్నానని చెప్తాడు. అదొక కామెడీ హారర్ ఫిల్మ్ అని దానిని తప్పకుండా అందరూ చూడాలని ఆడియన్స్ ను కోరుతాడు. ఇక మాటల సందర్భంలో తను అలా చేయడం తప్పని పదే పదే సుజాత ..రాకింగ్ రాకేశ్ ను ఉద్దేశించి అంటుంది. దాంతో మధ్యలో రాకేశ్ ఆ రూమ్ నుంచి వెళ్లిపోతాడు.

అసలా విషయం ఏంటని అడగగా, తనకు షూటింగ్ టైమ్ లో టీ తాగుతావా? అని అడగలేదని తను బాధపడుతున్నానని ‘బిగ్ బాస్’ సుజాత అంటోంది. ఆ విషయం విని గెటప్ శ్రీను భార్య షాక్ అవుతుంది. ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతమా? అని అంటుంది. టీ అంటే తనకు చాలా ఇష్టమని, అదొకి ఎమోషన్ అని అయినప్పటికీ తనను అడగలేదని బాధపడుతున్నానని సుజాత చెప్తుంది. అప్పుడే ఇంట్లో చేసిన టీ తీసుకొచ్చిన రాకింగ్ రాకేశ్.. ఈ విషయం తెలుసుకుని ..షూటింగ్ లో టీ బాగొదని, అందుకే తను అడగలేదని చెప్తాడు. అలా వారిరువురి మధ్య ఉన్న గొడవ పరిష్కారమవుతుంది.

 

ఇంతలో మరీ పెళ్లి ఎప్పుడో చెప్పండి? అని గెటప్ శ్రీను భార్య అడగగా, పెళ్లి కోసం త్వరలో ప్రత్యేకమైన వీడియో చేస్తామని రాకింగ్ రాకేశ్ చెప్తాడు. సుజాత సైతం వెళ్లిపోతుందట. అలా టీ కోసం హర్ట్ అయిన సుజాత-రాకింగ్ రాకేశ్ ల గురించి సుజిశ్రిన్ యూట్యూబ్ చానల్ వీడియో చేయగా, దానికి మంచి స్పందన వస్తోంది. టీ కోసం సుజాత అంతలా బాధపడిందా? అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news