సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపిన కోమటిరెడ్డి

-

కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ రాజీనామా లేఖను గురువారం ఆయన సోనియా గాంధీకి పంపించారు. కాంగ్రెస్ పార్టీని కొందరు నిర్వీర్యం చేశారని ఆరోపించిన కోమటిరెడ్డి పార్టీకి విధేయులైన వారిని అడుగడుగునా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అవమానాల నేపథ్యంలో కన్నీళ్లు, కష్టాలు దిగమింగుకుంటూ కొనసాగానని తెలిపారు.

komatireddy rajgopal reddy

మీ పైనే వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వ్యక్తికి పిసిసి పీఠం అప్పగించారని కూడా ఆయన సోనియా గాంధీకి తెలిపారు. ఇది తనను తీవ్రంగా వేధించిందని లేఖలో పేర్కొన్నారు. ఆ బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అలాగే 8వ తేదీన అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ స్పీకర్ ని కోరారు. ఆరోజు సభాపతికి రాజీనామా లేఖ ఇవ్వనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news