హాలీవుడ్ లో నటించిన మొట్టమొదటి తెలుగు నటుడు ఎవరో తెలుసా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది తెలుగులో సత్తా చాటిన తర్వాత బాలీవుడ్లో కూడా మంచి పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ , అల్లు అర్జున్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాన్ ఇండియా హీరోలుగా చలామణి అయిన వారు తర్వాత హాలీవుడ్ రేంజ్ లో కూడా నటించాలని ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ గతంలో కూడా చాలామంది హాలీవుడ్ లో నటించే ప్రయత్నం చేశారు. అయితే ఆ కాలంలోనే మొట్టమొదటిసారిగా తెలుగు నుంచి హాలీవుడ్లో నటించిన నటులు కూడా ఉన్నారు. అలాంటి వారిలో మొట్టమొదటి నటుడు ఎవరో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..File:Angry rajanala.jpg - Wikimedia Commonsఅంతా ఇక ఆ కాలంలోనే ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలకు గట్టిపోటీ ఇస్తూ విలన్ గా చలామణి అయిన రాజనాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1925 జనవరి 3వ తేదీన నెల్లూరు జిల్లాలోని కావలి లో జన్మించిన ఆయన అసలు పేరు రాజనాల కల్లయ్య. అలియాస్ రాజనాల కాళేశ్వరరావు. 1948లో నెల్లూరు లో ఉన్న తన స్నేహితుడు లక్ష్మి కుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే నాటక సంస్థను కూడా ప్రారంభించారు. ఇక ఆ తరువాత 1951లో మిత్రుడు లక్ష్మి కుమార్ రెడ్డి నుంచి మద్రాస్ కి పిలుపు రావడం అక్కడ ప్రతిజ్ఞ సినిమాకు విలన్ గా ఎంపికవడం.. మొదటిసారి రూ.200 కూడా పారితోషికం అందుకున్నారు.Rajanala | Zee News Telugu

ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలకు పోటీగా.. విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజనాల 1950, 60 సంవత్సరాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రసిద్ది చెందాడు. అంతేకాదు ఆ కాలంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో బహుముఖ నటుడు ఎన్టీరామారావు కి ప్రసిద్ధిచెందిన విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో లేకపోయినా విలన్గా హాస్యనటుడిగా 25 సంవత్సరాల పాటు తెలుగులో రాణించిన మొట్టమొదటిసారి 1966 లో మాయ ది మెగ్నీషియంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి.. హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారు రాజనాల.

Read more RELATED
Recommended to you

Latest news