గ్రామ సర్పంచులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్

-

గ్రామ సర్పంచు లకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 73, 74 రాజ్యాంగ అధికరణలకు టిఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది అన్నారు. గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం. న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచులు చేసే ఆందోళనలకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచుల పట్ల జిల్లా అధికారుల వేధింపులు ఆపాలన్నారు.

bandi-sanjay
bandi-sanjay

గ్రామాలకు రావలసిన పెండింగ్ బిల్లులు, గ్రామ సర్పంచ్ ల హక్కుల పరిరక్షణ కోసం త్వరలోనే బీజేపీ శాఖ మౌనదీక్ష చేపడుతుంది అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తోందని అన్నారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ అనే అంశం కింద ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చింది అన్నారు. సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని,అధైర్య పడవద్దని మీకు అండగా బీజేపీ ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సగర్వంగా తల ఎత్తుకునేలా చేసే బాధ్యత బీజేపీదేనని లేఖలో పేర్కొన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news