అరుంధతి, అమ్మోరు లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన ఏకైక దర్శకుడు కోడి రామకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రాఫిక్స్ లేని సమయంలో కూడా తన సినిమాలతో అత్యున్నత రియాల్టీని ప్రదర్శించి.. తన సినిమాలతో ప్రేక్షకులలో వణుకు పుట్టించాడు. ఇక అలా సుమారుగా 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన ఈయన తన సినిమాలతో ఒక ప్రత్యేకమైన మార్క్ ను కూడా క్రియేట్ చేసుకున్నారని చెప్పవచ్చు. తెలుగులోనే కాకుండా ఇతర భాష చిత్రాలలో కూడా దర్శకత్వం వహించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా కోడి రామకృష్ణ ను చూడగానే కొన్ని లక్షణాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి.. అవేమిటంటే నుదుటిన తిలకం.. తలపాగా.. చేతికి దారాలు ఎన్నో మనం చూడవచ్చు. వీటిని బట్టి చూస్తే చాలు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అని గుర్తుకొస్తుంది.ఇకపోతే కోడి రామకృష్ణ వీటన్నింటిని ధరించడం వెనుక అసలు కారణం కూడా ఉందట. స్వయంగా కోడి రామకృష్ణ ఈ విషయాలను వెల్లడించడం జరిగింది. తరంగిణి మూవీ షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మేకప్ మ్యాన్.. నా నుదురు బాగా పెద్దదిగా ఉంది.. ఎండ ఎక్కువగా తగులకుండా నుదుటికి తెల్ల కర్చీఫ్ కట్టారు అని కోడి రామకృష్ణ తెలిపారు. తలకట్టు కట్టుకున్న రోజు నుంచి నా పని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పూర్తి చేయడంతో పాటు దానిని నేను సెంటిమెంట్గా కొనసాగించాను అని తెలిపారు.
ఆ తర్వాత కే బాలచందర్ సైతం ఒక దర్శకత్వంలో బ్యాండ్ మీకు ప్రత్యేక గుర్తింపును ఇస్తుందని ఈ బ్యాండు పూర్వజన్మ బంధానికి సంకేతం అని చెప్పడంతో ఆ బ్యాండ్ను కూడా ఆయన అలాగే కొనసాగించారు. చేతికి ఆ బ్యాండ్ ధరించిన తర్వాత దేవుళ్ళు , అమ్మోరు, దేవి వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఆ తర్వాత ఎక్కువగా దేవత కథాంశం తో తెరకెక్కించే చిత్రాలు చేసినప్పుడు దోషాలు , పీడలు తగలకుండా ఎప్పటికప్పుడు చేతికి దారాలు కట్టించుకునే వాడట . ఇక అలా వీటి కోసమే ఆయన ఇలా ధరించడం జరిగింది అని సమాచారం.