రొయ్యలంటే ఇష్టమేనా..? వాటిని ఇలానే తింటే కష్టమే..!

-

సీ ఫుడ్స్‌ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిన సరైన పద్ధతిలో శుభ్రపరిచి సరైన పద్ధతిలో వండినప్పుడే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. లేకపోతే విషం తిన్నట్లే. సీ ఫుడ్స్‌లో సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. గుండెకి మేలు చేస్తుంది. రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించడంలో సహాయపడుతుంది. ఎంతో రుచిగా ఉండే రొయ్యలు చర్మంపై దురదలు, అలర్జీకి కారణం అవుతాయని మీకు తెలుసా? అదెలా అనుకుంటున్నారా.. రొయ్యల వీపుపై ఉండే నల్లని రక్తనాళాలు తొలగించకపోతే తీవ్రమైన సమస్యలు రావచ్చు. వాటిని ఉన్నప్పుడు తినడం వల్ల మరణం కూడా సంభవించొచ్చు. అందుకే వాటిని వండుకునే ముందు చాలా జాగ్రత్తగా శుభ్రం చేసుకోవాలి.

ఏంటి ఈ రక్తనాళాలు

రొయ్యల మీద ఉండే నల్లటి రక్తనాళాలు తప్పనిసరిగా తొలగించాలి. ఇది వ్యర్థాలు, విషపదార్థాలను మోసే ఈ సముద్ర ఆహారాల పేగు మార్గం.. ఈ సిరలను తొలగించకపోయినా.. లేదా పాక్షికంగానే తొలగించినా తీవ్రమైన ఫుడ్ అలెర్జీ రావడమే కాదు, అదే సమయంలో ప్రాణాంతకం కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకే అలాంటి అలర్జీలు రాకుండా ఉండాలంటే ఈ రక్తనాళాలను తప్పకుండా తొలగించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రొయ్యల మీద కనిపించే నల్లని రక్తనాళాలు తొలగించకుండా తినడం వల్ల పుడ్‌ అలర్జీ అవుతుంది. అయితే అది తిన్న వెంటనే ఒక్కోసారి మీకు కనిపించకపోవచ్చు. అది పేగుల్లో వ్యర్థాలు, టాక్సిన్స్, రసాయనాలు రూపంలో ఉంటుంది. ఇవి మన జీర్ణవ్యవస్థ, పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వాటిని తొలగించకుండా వండుకుని తినడం వల్ల సడెన్‌గా చర్మంపై దద్దుర్లు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గురక, గొంతులో ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అయితే ఇవి తినడం వల్ల ప్రాణాలకి హాని జరుగుతుందనే విషయం తేల్చడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు అంటున్నారు.

ఎలా శుభ్రం చేయాలంటే..

రొయ్యలు చల్లని నీటిలో వేసి బాగా కడగాలి. దుర్వాసన పోయేలా శుభ్రం చేయాలి. కత్తితో రొయ్యల తల, తోకలని కత్తిరించాలి. తర్వాత రొయ్యల చుట్టూ చీలిక చేసి వాటి దగ్గర ఉండే నల్లటి లేదా ఆకు పచ్చని రక్తనాళాలను కత్తితో కత్తిరించి తొలగించాలి. తర్వాత రొయ్యల కాళ్ళని తొలగించాలి. చివరగా రొయ్యలని మరోసారి చల్లని నీటితో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి శుభ్రం చేసుకోవాలి. పసుపు వేయడం వల్ల దానికి ఉండే నీసు వాసన పోతుంది. ఆ తర్వాతే వాటిని వండుకుని హ్యాపీగా లాగించేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news