ఆంధ్ర ప్రదేశ్‌లో దసరా సంబురం మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు దసరా సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో పాఠశాలలకు ఈనెల 26 నుంచి అక్టోబరు 6 వరకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. 25న ఆదివారం కావడంతో మొత్తం 12రోజులు సెలవులు ఉంటాయి.
క్రిస్టియన్, ఇతర మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబరు ఒకటి నుంచి ఆరో తేదీ వరకు సెలవులు ఇచ్చారు. సెలవుల తర్వాత ఫార్మెటివ్-1 పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఓమ్మార్ షీట్‌తో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓఎమ్మార్ షీట్ల ముద్రణ పూర్తికాకపోవడంతో పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షలకు రూ.కోట్లు వెచ్చించి, ఓఎమ్మార్ షీట్లు ముద్రించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 12 రోజుల పాటు హాయిగా ఆడుకోవచ్చని ఖుష్ అవుతున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఇన్ని రోజులు సెలవులు రావడం ఇదే తొలిసారి కావడంతో విద్యార్థులంతా ఉత్సాహంగా ఉన్నారు.