భోజన ప్రియులకు ఒకటే పని ఉంటుంది.. ఏ హోటల్ లో ఫుడ్ బాగుంటుంది అని వెతకడం వెళ్ళి ఫుల్ గా లాగించడం..అయితే మనం ఓ హోటల్ కు వెళ్లగానే ముందుగా మెనూ ను చూసి మనకు కావలసిన భొజనాన్ని ఆర్డర్ చేస్తాము..అది అందరూ చేసేపని..సాధారణంగా మెనూ కార్డులో ఐటెమ్ ధర తప్ప ఇతర వివరాలు ఉండవు. అయితే ధరతో పాటు ఆ ఫుడ్‌లో ఉండే కేలరీలు, పోషకాల వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలనే రూల్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.
అలా చేయలేదంటే ఏకంగా అధికారులు రెస్టారెంట్‌ను మూసివేసే అవకాశం కూడా ఉంది..
అసలు విషయానికొస్తే..దేశంలో రెస్టారెంట్లు నియమ, నిబంధనల ప్రకారం వ్యవహరించడం లేదని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని 16 ప్రముఖ రెస్టారెంట్లకు నోటీసులు పంపింది. ఇందులో ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో FSSAI చెప్పిన నిబంధనలు ఏవో ఒకసారి తెలుసుకుందాం…
రెస్టారెంట్ల రెగ్యులేటరీ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2020 నవంబర్‌లో రెస్టారెంట్లకు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రెస్టారెంట్ల మెనూలో తప్పకుండా ప్రతి డిష్ ద్వారా అందే కేలరీలతో పాటు పోషకాల వివరాలను మెన్షన్ చేయాలని పేర్కొంది. మెనూలో ఫిజికల్‌గా, డిజిటల్‌గా కూడా ప్రతి ఐటెమ్ నుంచి సైజ్ ప్రకారం అందే కేలరీలు, న్యూటిషన్స్ వివరాలను డిస్‌ప్లే చేయాలని స్పష్టం చేసింది..
రెస్టారెంట్లు ఈ రూల్స్ పాటించకపోతే ఆ ప్రభావం వినియోగదారులపైన పడనుంది. ఉదాహరణకు ఓ వినియోగదారుడు తినే డిష్‌లో ఉండే పోషకాలు ఏమిటో తెలియకపోతే, అది తన బాడీకి పడకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి..కొత్త రూల్స్ ప్రకారం, ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఒక హోటల్, రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, వాటిలో ఉండే కేలరీలు, పోషకాల వివరాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది..
ఈ హక్కును రెస్టారెంట్లు తోసిపుచ్చలేవు. ఒకవేళ రెస్టారెంట్లు నిబంధనలు పాటించకపోతే నోటీసులు పంపడంతో పాటు వాటి లైసెన్స్ రద్దు చేసే దిశగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.. ఈ విషయాలను ప్రతి కస్టమర్ తెలుసుకోవాలి..