టీఆర్ఎస్, బీజేపీలకు మునుగోడు అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదు : రేవంత్ రెడ్డి

-

టీఆర్ఎస్, బీజేపీలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆ పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థులను ప్రకటించే ధైర్యం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించడంతో హైదరాబాద్ గాంధీభవన్‌లో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు.

ఇప్పటికే టికెట్ ఆశించిన ఆశావహులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుజ్జగించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ బోస్‌ రాజు సహా ఇతర సీనియర్‌ నేతలు మునుగోడు ఉపఎన్నిక, పలు అంశాలపై చర్చించారు.

కేసీఆర్‌ను సంతోష పెట్టేందుకు ఆ పార్టీ నాయకులు.. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నట్లుందని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల వ్యవస్థలు కుప్పకూలాయని విమర్శించారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచార వ్యూహంలో భాగంగా పలువురు సీనియర్‌ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఈ నెల 18 నుంచి ప్రచారం ప్రారంభిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news