ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అనారోగ్య సమస్యల నుంచి బయట పడాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. అలాగే వ్యాయామం వంటి పద్ధతులను అనుసరిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చాలా మంది ఈ మధ్య కాలం లో గ్యాస్ సమస్య తో ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ సమస్య మనం తీసుకునే డైరీ ప్రొడక్ట్స్, పండ్లు, కూరగాయలు వీటి వల్ల కూడా వస్తుంది.
మీరు కూడా తరచుగా గ్యాస్ సమస్య తో బాధ పడుతున్నారా..? ఆ సమస్య నుండి బయట పడాలి అని చూస్తున్నారా..? అయితే తప్పకుండా ఈ విధంగా అనుసరించండి. అయితే మరి ఎలా గ్యాస్ సమస్య నుండి బయట పడవచ్చు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరు ఈ విధంగా తయారు చేసుకొని తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు”
ఒక కీరా
కొన్ని పుదీనా ఆకులు
కొత్తిమీర
అల్లం
ఉప్పు
ఒక కప్పు నీళ్లు
నిమ్మరసం
తయారు చేసుకునే పద్ధతి:
ఒక మిక్సీ జార్ తీసుకొని నిమ్మరసం తప్పించి అన్ని వేసి మిక్సీ పట్టండి. ఆ తర్వాత ఒక గ్లాసులో దీన్ని వేసుకుని నిమ్మ రసాన్ని యాడ్ చేసుకోండి ఇలా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. అంతే కాకుండా గ్యాస్, బ్లోటింగ్ వంటి ఇబ్బందులు కూడా ఉండవు. కనుక ఈ విధంగా అనుసరించి ఆ సమస్య నుండి బయట పడండి.