చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి రాత్రి కథలు చెబుతూ ఉంటారు. నిజానికి పిల్లలకి కథలు చెప్పడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి కథలు చెప్పడం వల్ల పిల్లల లో ఏకాగ్రత పెరుగుతుంది. సృజనాత్మకంగా పిల్లలు మారడానికి అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా కాస్త సమయం పిల్లలకి కథలు చెప్పడంపై కేటాయిస్తే మంచిది. పిల్లలకి కథలు చెప్పడం వల్ల ఎటువంటి లాభాలు పొందొచ్చు అనేది చూద్దాం.
ఏకాగ్రతని పెంచొచ్చు:
తల్లిదండ్రులు పిల్లలకి కథలు చెప్పడం వలన పిల్లలలో ఏకాగ్రత పెరుగుతుంది. కథలో వినే సమయంలో వారిలో ఏకాగ్రత శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పూర్తి ధ్యాస పెడతారు కనుక.
ఊహా శక్తి పెరుగుతుంది:
ఊహా శక్తి పిల్లల్లో కథలు వినడం వలన పెరుగుతుంది.
ఆలోచనా శక్తి పెరుగుతుంది:
ఊహా శక్తి మాత్రమే కాకుండా పిల్లల్లో ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి కచ్చితంగా పిల్లలకు చెప్పండి.
సృజనాత్మకంగా మారతారు:
పిల్లలకి తల్లిదండ్రులు కథలు చెప్తే సృజనాత్మకంగా మారతారు పిల్లలు. కాబట్టి కచ్చితంగా పిల్లలకి కథలు చెప్పడం మంచిది. దానితో పిల్లలు ఇలాంటి లాభాలను పొందేందుకు అవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కచ్చితంగా కాస్త సమయం పిల్లలకి కథలు చెప్పడంపై కేటాయిస్తే మంచిది.