మునుగోడు ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. ఊరూరా కలియ తిరుగుతూ రాజకీయ పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థి గెలువాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే.. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలం వారి గూడెంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్‌తో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ… మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో ప్రజలందరికీ తెలుసునన్నారు మంత్రి పువ్వాడ. 24 గంటల ఉచిత కరెంటు కావాలంటే టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని, 6 గంటల కరెంటు కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు మంత్రి పువ్వాడ.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ ఉప ఎన్నిక మోదీ, కేసీఆర్‌కు మధ్య నడుస్తుందన్నారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కూడా మోటార్లుకి మీటర్లు పెడితే ఏమవుతుందని మాట్లాడుతున్నాడన్నారు మంత్రి పువ్వాడ. మోదీ గత ఎన్నికల్లో నల్లధనం వెనక్కి తెచ్చి 15 లక్షలు అకౌంట్లలో వేస్తా అన్నాడనీ.. కానీ ఆ మాట ఇప్పటికీ నిలబెట్టుకోలేదని గుర్తు చేశారు మంత్రి పువ్వాడ. వంట గ్యాస్ ధరను రూ.400 నుంచి రూ.1200కు పెంచినందుకు మోదీకి ఓటు వేయాలా? అని మంత్రి పువ్వాడ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా బీజేపీ ప్రభుత్వం పెంచింది నిజం కాదా? అని ప్రశ్నించారు మంత్రి పువ్వాడ. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల గెలిచిన రెండు నెలలో డబుల్ బెడ్ రూంలు ప్రారంభించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు మంత్రి పువ్వాడ.