అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారాన్ని కొనాలని అనుకుంటూ ఉంటారు. ఈసారి మీరు కూడా అక్షయ తృతీయ కి బంగారాన్ని కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ చిట్కాలని పాటించడం మంచిది. బంగారంనీ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. నగల దుకాణాలన్నీ కూడా జనంతో నిండిపోతాయి.
చాలా మంది అక్షయ తృతీయ కి బంగారు నగలనే కొంటూ ఉంటారు అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొనుగోలు చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అంతా శుభం కలుగుతుందని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు అమ్మకాలు బాగా ఎక్కువ ఉంటాయి అయితే బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి.
బిల్ తీసుకోండి:
ఎంత బంగారం ని మీరు తీసుకున్నా కూడా బిల్ ని అడిగి తీసుకోండి. బంగారం స్వచ్ఛత ఎంత, మేకింగ్ ఛార్జీలు ఎంత, వేస్టేజీ ఎంత, రాళ్లు ఉంటే వాటి వెయిట్, వాటి ధర ఇలా అన్నీ క్లియర్ గా ఉండేలా మీరు బిల్ ని తీసుకోండి.
బంగారం ధర:
మీరు బంగారం కొనాలంటే ఆ రోజు ఎంత రేటు ఉందొ చూసి అప్పుడే వెళ్ళండి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రతీ రోజూ బంగారం ధరను చెప్తుంది. బంగారం ధర మీరు కొనే రోజు తక్కువ ఉందొ లేదో చూసుకోండి. అప్పుడే వెళ్ళండి.
మేకింగ్ ఛార్జీలు:
నగలు తయారు చేయడానికి అయ్యే ఖర్చే మేకింగ్ ఛార్జీలు అంటారు. మేకింగ్ ఛార్జీలు 3 నుంచి 25 శాతం మధ్య ఉంటాయి. మేకింగ్ ఛార్జీలు, మజూరీ వేర్వేరు కాదు.
వేస్టేజీ ని చూడండి:
బంగారాన్ని కరిగించి ఆభరణాలు తయారుచేసే ప్రాసెస్‌లో కొంత బంగారం వేస్ట్ అవుతుంది. ఈ వేస్టేజీని కస్టమర్ భరించాలి. మెషీన్ ద్వారా తయారయ్యే వాటికీ కూడా వేస్టేజీ ఉంటుంది
5 నుంచి 7 శాతం వరకు ఈ చార్జెస్ ఉంటాయి.
హాల్‌మార్క్:
హాల్‌మార్క్ ఉన్న నగలుని మాత్రమే తీసుకోండి. ఇదుంటే బంగారం స్వచ్ఛతకు హామీ తీసుకున్నట్టే.