ప్రైవేట్ వీడియోలు పోస్ట్ చేస్తామంటూ స్టార్ హీరోకు బెదిరింపు లెటర్స్…

-

ఈ రోజు ఉదయాన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ అభిమానులు అందరికీ శుభవార్తను తెలియచేశారు. హీరోగా కొనసాగుతున్న కిచ్చా సుదీప్ రాజకీయాల్లోకి రానున్నదని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ అది ఈ రోజుకి ఒక స్పష్టతను ఇచ్చాడు. ఈ రోజు సుదీప్ జాతీయ పార్టీ బీజేపీ లోకి చేరుతాడని ప్రకటించిన కొద్దీ సేపటి తర్వాత , ఇద్దరి నుండి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ లేఖలో వారు చెప్పిన ప్రకారం నువ్వు కనుక బీజేపీలో చేరితే నీకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తామని ఉంది.

ఇంకా ఆ లేఖలో అసభ్య పదాలతో కూడిన మాటలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపైన సుదీప్ మేనేజర్ జాక్ మంజు పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఎవరు ఈ లేఖలు పంపి ఉంటారన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. కాగా దీనిపై సుదీప్ ఏమీ స్పందించకపోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news