దారుణం: సండే ఆ ప్రభుత్వ ఆస్పత్రికి సెలవు ప్రకటించుకున్న వైద్యులు..!!

-

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండె నొప్పితో బాధపడుతున్న ఓ పేషంట్ వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరాడు. తీరా ఆస్పత్రికి వెళ్లిన బాధితుడికి వైద్యం అందకపోగా.. అందుబాటులో వైద్యులు, వైద్య సిబ్బంది కనిపించలేదు. దీంతో పేషంట్ కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. 50 పడకలు ఉన్న ఆస్పత్రిలో కేవలం ఒక్క నర్సు ఉండటం గమనార్హమన్నారు. అలాగే, అదే సమయంలో గర్భస్రావమై ఓ గర్భిణి ఆస్పత్రికి వచ్చిందన్నారు. ఆస్పత్రిలో వైద్యులు లేకపోవడంతో బాధితులు ఇద్దరు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. వీరితోపాటు ఉదయం నుంచి ఆస్పత్రికి వచ్చిన పేషంట్లు కూడా వైద్యులు లేని కారణంగా తిరిగి వెళ్తున్నారు.

వైద్య సిబ్బంది
వైద్య సిబ్బంది

ఈ సందర్భంగా పేషంట్ల కుటుంబీకులు మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం చాలా మంది వచ్చామన్నారు. ఆస్పత్రిలో ఒక్క నర్సు తప్పా.. వైద్యులు, వైద్య సిబ్బంది కనిపించలేదన్నారు. వైద్యులు ఎక్కడున్నారని అడగగా.. ఆదివారం వైద్యులకు సెలవు ప్రకటించినట్లు చెప్పారని, ప్రభుత్వ ఆస్పత్రికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదివారం సెలవు ఎలా ప్రకటించిందన్నారు. వైద్యం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ తిరుగు ప్రయాణమయ్యారని, అత్యవసర సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేషంట్ల కుటుంబీకులు డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news