కరోనా మహమ్మారి వల్ల చాలా మంది అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జనవరి నెల ముగిసేటప్పటికీ చాలామంది కరోనా బారిన పడ్డారు. ఈ వారంలో 800 మంది కరోనాతో మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో పక్క ప్రభుత్వం వ్యాక్సిన్లను కూడా ఇస్తోంది. ఇప్పటికే 75 శాతం మంది భారతీయులు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులుని తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ లభిస్తుందని కొంత మంది రీసెర్చర్లు అంటున్నారు.
అలానే కరోనా తాలూక లక్షణాలు అంత ఎక్కువగా ఉండవని.. ఇబ్బందులు రావని అన్నారు. అయితే ఇంక క్వారంటైన్ లో ఇన్ని రోజులు ఉంటే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఉంటుంది..? కరోనా స్ప్రెడ్ ఎప్పుడు ఆగుతుంది అనే దాని గురించి చూద్దాం. తాజాగా చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ విషయాలు బయటపడ్డాయి. Pasteur-USP Scientific Platform పబ్లిష్ చేసిన దాన్ని మీరు చూస్తే.. కొంత మంది కరోనా బారినపడి 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నా ఆ తర్వాత వాళ్ల ద్వారా మరొకరికి కరోనా సోకుతోందని తెలిపారు.
దీనితో ఐసోలేషన్ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేయాలని తెలుస్తోంది. కొన్ని కేసుల్లో చూసుకున్నట్లయితే కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ కి రావడానికి 30 రోజులు సమయం పడుతోంది. అంటే దీని ప్రకారం చూసుకున్నట్లయితే 14 రోజులు క్వారంటైన్ సరిపోదు. 14 రోజులు క్వారంటైన్ లో ఉన్నా సరే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. కనుక 30 రోజులు వరకు ఉంటే మంచిదని రీసెర్చర్లు అంటున్నారు. ఏదిఏమైనా కరోనా బారిన పడకుండా సురక్షితంగా ఉండండి. సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ధరించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకోండి.