మన భాగస్వామి పై ప్రేమ కలిగితే అది ఆటోమేటిగ్గా శృంగారానికి దారి తీస్తుంది..నిజానికి మహిళలు శృంగారానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు..తమ భాగస్వామితో మళ్లీ మళ్లీ ఫిజికల్‌గా కలిసేందుకు ఇష్టపడుతుంటారు. దీనివల్ల సెక్సువల్ బాండింగ్ పెరిగడమే కాకుండా, సామర్థ్యం కూడా పెరుగుతుంది. అయితే, అతి శృంగారం కూడా ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతి దానికి లిమిట్స్ ఉన్నట్లే.. ఈ విషయంలోనూ లిమిట్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ప్రభావితం అవుతారని చెబుతున్నారు.శృంగారానికి లిమిట్ లేదని ఎన్ని సార్లు అయిన పాల్గొనవచ్చు..కానీ స్త్రీలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు..అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల స్త్రీ జననాంగం పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా తదుపరి కలయిక బాధకరంగా మారుతుంది. ఇలాంటి కంప్లైంట్స్ తమకు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు..
అదే విధంగా జననాంగం వాపు వస్తుంది. దీని కారణంగా ఎక్కోరియేషన్ వంటి సమస్యను ఎదుర్కొంటారు. మూత్రంలో మంట, నొప్పి, వాపు వంటిది వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు..
ఇకపోతే శృంగారం సమయంలో వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతంది. ఈ కారణంగా వెన్నునొప్పి వస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది..లైంగికంగా చురుకుగా ఉండే చాలా మంది స్త్రీలు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. వేర్వేరు వ్యక్తులతో సెక్స్ చేయడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.. ఇవే కాదు ఇంకా శారీరక సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.. ఏదైనా కూడా లిమిట్ గా చేస్తే ఆనందం,ఆరోగ్యం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకొవాలి..