అతిగా హస్తప్రయోగం చేస్తే స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతుందా..Musturbationపై మీకు ఉన్న అపోహలు ఇవేనా..?

-

వయసొచ్చాక.. అబ్బాయిలకు అన్నీ తెలిసిపోతాయి.. అబ్బాయిలకే కాదు.. అమ్మాయిలకు కూడా.. అయితే.. సెక్స్‌ విషయంలో అబ్బాయిలు కాస్త ముందుంటారు..పైకి ఎంత డీసెంట్‌గా, ఎంత బిజీగా ఉన్న అబ్బాయిలు అయినా.. హస్తప్రయోగం చేయకుండా మానరు.. కొందరు వారానికి నాలుగుసార్లు చేస్తే.. మరికొందరు రెండు రోజులకు ఒకసారి అయినా చేస్తారు.. వాళ్ల ఒత్తిడిని తగ్గించే మార్గం ఇది.. అయితే ఎప్పటినుంచే నిపుణులు చెప్పేమాట.. హస్తప్రయోగం ఎక్కువగా చేస్తే మంచిది కాదు అని.. హస్తప్రయోగంపై వాస్తవాలు, అపోహలు ఇక్కడ తెలుసుకోండి.

హస్తప్రయోగం (Musturbation) చేసుకోవడం వలన ఎలాంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. కానీ అధిక హస్త ప్రయోగం లేదా రోజువారీగా హస్తప్రయోగం చేసుకుంటే అది అనేక విధాల దుష్ప్రభావాలను కలిగిస్తుంది, మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక సర్వే ప్రకారం, ప్రతిరోజూ హస్తప్రయోగం చేసుకునే వాళ్లలో ఆడవారు సగటున 27 శాతం ఉండగా, మగవారు 65 శాతం ఉన్నారు.

హస్తప్రయోగం వలన కలిగే ప్రయోజనాలు..

ఒత్తిడి. ఆందోళన తగ్గుతుంది.

మంచి నిద్ర కలుగుతుంది.

మానసిక స్థితి మెరుగుపడుతుంది.

డిప్రెషన్ భావాలు తగ్గుతాయి.

శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.

ఆనందం, సంతృప్తికరమైన అనుభూతి లభిస్తుంది.

నొప్పుల నుండి ఉపశమనం.

లైంగిక ఒత్తిడిని విడుదల చేస్తుంది.

మీ కోరికలు, లైంగిక అవసరాలపై అవగాహన ఏర్పడుతుంది.

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు కొంతమంది గర్భిణీలకు లైంగిక కోరికను పెంచుతాయి. గర్భధారణ సమయంలో లైంగిక ఒత్తిడిని వదిలించుకోవడానికి హస్త ప్రయోగం సురక్షితమైన మార్గం.

హస్తప్రయోగం చేసుకోవడం వలన కొన్ని సమస్యలు వస్తాయని భావిస్తారు, నిజానికి అవన్నీ అపోహలే.

నిర్జలీకరణము (Dehydration)
హార్మోన్ల అసమతుల్యత
పురుషాంగం పరిమాణం లేదా ఆకృతిలో మార్పులు
స్పెర్మ్ కౌంట్ తగ్గడం
దృష్టి నష్టం
మొటిమలు రావడం
వెంట్రుకల అరచేతులు
అంగస్తంభన లోపం
లైంగిక కోరికలు తగ్గిపోవడం..ఇవన్నీ అపోహలే..

అతిగా హస్తప్రయోగం వలన కలిగే దుష్ప్రభావాలు..

పురుషాంగంలో మంట, నొప్పులు, గాయాలు కావచ్చు. కొన్నిసార్లు శరీర భాగాలు ఉబ్బి ఎడెమా సమస్యకు దారితీస్తుంది.

అతిగా హస్తప్రయోగంతో టెస్టోస్టెరాన్‌ సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది తక్కువ స్పెర్మ్ కౌంట్‌కు ఒక కారణం కావచ్చు. హస్తప్రయోగం దుష్ప్రభావాలలో అజోస్పెర్మియా ఒకటి.

పురుషులు అతిగా హాస్తప్రయోగం చేసుకుంటే Dhat Syndromeకు దారితీయవచ్చు. ఈ సమస్య ఉన్నప్పుడు మూత్రం ద్వారా వీర్యం బయటకు వెళ్లిపోతుంది.

అంగస్తంభనలో ఇబ్బందులు, తిరోగమన స్ఖలనం మొదలైన స్ఖలన సమస్యలకు కారణం కావచ్చు.

హస్తప్రయోగంకు అలవాటుపడిన పురుషులు నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటారు. వీర్య స్ఖలనం జరిగేంత వరకు నిద్రపోరు.

హస్తప్రయోగంకు అలవాటుపడిన వారు అతిగా పోర్న్ చూడటం, ఎప్పుడూ లైంగిక ఆలోచనలు కలిగి ఉండటం చేస్తారు. ఫలితంగా వారిలో ఏకాగ్రత లోపిస్తుంది, వారి ఉత్పాదకత దెబ్బతింటుంది.

హస్తప్రయోగంకు అలవాటుపడిన వారు శృంగారం ద్వారా లైంగిక సంతృప్తిని పొందలేరు.

Read more RELATED
Recommended to you

Latest news