శృంగారం విసుగొస్తుందా..? ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి..!

-

లైఫ్‌లో ఏదైనా బోర్‌ కొడుతుందేమో కానీ.. శృంగారం మీద మాత్రం మనిషికి బోర్‌ కొట్టదు.. ముఖ్యంగా మగవారికి అయితే అసలే ఉండదు.. కానీ ఈరోజుల్లో చాలామంది జంటలు వివిధ కారణాల వల్ల శృంగారాన్ని కూడా భారంగా కానిచ్చేస్తున్నారు. రెండు తనువులు ఒక్కట్టే ఇది ఓ గొప్ప కార్యం.. ఒత్తిడి, ఆందోళన, మానసిక చికాకను తొలగించి మందు.. అయితే మీకు శృంగారం విసుగు తెప్పిస్తున్నట్లేతే.. కొన్ని చిట్కాలను ట్రై చేయండి.. మీ శృంగారాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు నిపుణులు అందించిన చిట్కాలు ఇవే…

మాట్లాడుకోండి

మాట్లాడటం, ఊసులు చెప్పుకోవడం అనేది ఆరోగ్యకరమైన సంబంధానికి మూలస్తంభం. వెంటనే పనికాచ్చేయాలని అబ్బాయిలకు ఉంటుంది.. కానీ అమ్మాయిలకు అలా ఉండదు.. ముందు ప్రేమగా కబుర్లు చెప్పాలనే చూస్తారు.. సెక్స్ విషయంలో ఇది చాలా అవసరం. సిగ్గులేకుండా మీ కోరికలు, ఊహల గురించి మీ భాగస్వామితో మాట్లాడండి. ఒకరికొకరు మీలోని భావాలను నిజాయితీగా వ్యక్తపరుచుకోండి. లైంగిక సంభాషణలు, శరీర భాగాల అన్వేషణల గురించి మాట్లాడుకోండి. ఆ మాటలే మీలో కోరికను తట్టి లేపుతాయి. అమ్మాయి, అబ్బాయి మధ్య కమ్యునికేషన్‌ డవలప్‌ అవ్వాలంటే.. కాస్త డర్టీ మైండ్‌ ఉండాల్సిందే..!

ప్లేస్ కూడా ముఖ్యమే..

మీ చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనోహరంగా ఉంటే మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మిమ్మల్ని రతిక్రీడకు సిద్ధం అయ్యేలా ప్రేపిస్తుంది. పడకగదిలో ప్రకాశవంతమైన లైట్లను ఆర్పివేసి, మసకమసక లైట్స్‌ ఉంచుకోండి.. సువాసనల పరిమళాలు వెదజల్లే ఏర్పాట్లు చేసుకోవడం, పడకగదిని అందంగా అలంకరించడం వంటివి మీలోని ఇంద్రియాలను ఉత్తేజపరుస్తాయి.

సమయాన్ని వెచ్చించండి..

వెంటనే రంగంలోకి దూకకుండా నెమ్మదిగా ఇద్దరూ దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి. మీ భాగస్వామిని దగ్గరకు తీసుకొని కళ్లలో కళ్లు పెట్టి చూడండి, ముంగురులను సింగారించండి, శరీర సుగంధాన్ని ఆస్వాదించండి. ఇలా మీ సాన్నిహిత్యాన్ని పెంచుకోండి, ప్రేమను ప్రేమగా పంచుకోండి. ఇందుకోసం కావలసినంత సమయాన్ని వెచ్చించండి.

ఫోర్ ప్లే మరిచిపోవద్దు

శృంగారంలో ఇది చాలా ముఖ్యమైన పార్ట్‌.. ఒకేసారి ఫోర్లు, సిక్సులు కొట్టకుండా సింగిల్స్ కోసం ప్రయత్నం చేయండి. భాగస్వామి ఒళ్లు తడమడం, ముద్దులతో తడి చేయడం, వెచ్చగా హత్తుకోవడం ఇందులో ప్రధానం. సంతృప్తికరమైన శృంగారంలో ఫోర్ ప్లే చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది.

క్రొత్తగా ట్రై చేయండి..

ఫోర్ ప్లే తర్వాత అసలైన క్రీడలోకి వెళ్లండి. ఇప్పుడు మీరు శృంగారానికి మసాలా జోడించండి.. మీ మనసుకు నచ్చినట్లుగా సంతోషంగా సెక్స్ చేయండి. కొత్తకొత్త భంగిమలను ప్రయత్నించండి. వివిధ రకాల భంగమలను మీ ఇద్దరు కలిసి కనుగొనండి. అలసి పోయేంత వరకు ఆటను కొనసాగిస్తూనే ఉండి, చివరకు భావప్రాప్తితో సంతృప్తిగా మీ భోజనాన్ని ముగించండి.

Read more RELATED
Recommended to you

Latest news