కరోనా వైరస్ పుట్టింది చైనాలో అయినా సరే దీని ప్రభావం అమెరికాలో మాత్రం చాలా దారుణంగా ఉంది. నాలుగు లక్షల మంది ప్రజలు కరోనా బారిన పడగా 12 వేల మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయారు. కరోనా వైరస్ తీవ్రత దెబ్బకు అమెరికా వాణిజ్య రాజధాని అయిన న్యూయార్క్ లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. దీనితో ఇప్పుడు అమెరికాకు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
తన దేశాన్ని ఏ విధంగా ఈ విపత్తు నుంచి బయటకు తీసుకురావాలో ట్రంప్ కి ఏ మాత్రం కూడా అర్ధం కావడం లేదు. దీనితో ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద తీవ్ర ఆరోపణలు చేసారు ట్రంప్. WHO నిజంగా తమను మోసంచేసి దెబ్బతీసిందని ఆయన ఆరోపణలు చేసారు. అమెరికా నుంచి పెద్ద మొత్తంలో నిధులు అందుకుంటున్నప్పటికీ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. చైనాలో కరోనా విజృంభిస్తున్న సమయంలో,
చైనీయులను అమెరికాలోకి అనుమతించవచ్చంటూ WHO ప్రతిపాదనలు చేసిందని గుర్తు చేసిన ట్రంప్…. ముందుగానే తాము తిరస్కరించడం మంచిదయిందని పేర్కొన్నారు. లేదంటే మరింత భారీ స్థాయిలో నష్టం వాటిల్లేదని ట్రంప్ కీలక వ్యాఖ్య చేసారు. ఇలాంటి తప్పుడు సలహాలు ఎందుకు ఇచ్చారంటూ ట్విటర్ లో ఆయన ట్వీట్ చేసారు. కాగా ట్రంప్ ప్రపంచ దేశాల సాయం కోరుతున్న సంగతి తెలిసిందే.
The W.H.O. really blew it. For some reason, funded largely by the United States, yet very China centric. We will be giving that a good look. Fortunately I rejected their advice on keeping our borders open to China early on. Why did they give us such a faulty recommendation?
— Donald J. Trump (@realDonaldTrump) April 7, 2020