ఎముకల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎముకల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా మంది తెలియక చిన్న చిన్న తప్పులు వల్ల ఎముకల ఆరోగ్యం పాడవుతుంది. అయితే మరి ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలి..? ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
చాలా మంది మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంచుమించు ప్రతి రోజు మాంసాన్ని తీసుకుంటూ ఉంటారు. కాని మాంసం ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలోని క్యాల్షియం యూరిన్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. దీంతో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అధికంగా మాంసం తీసుకోవడం మంచిది కాదు.
కూల్ డ్రింక్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫారిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలహీన పరుస్తుంది.
అదే విధంగా జంతువుల నుండి వచ్చే ప్రొటీన్లు తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం తగ్గుతుంది కాబట్టి దాన్ని కూడా తగ్గించుకుంటూ ఉండాలి.
ఎక్కువ చక్కెర మరియు సాల్ట్ ని తీసుకుంటే కూడా క్యాల్షియం తగ్గుతుంది.
కెఫిన్ అధిక మోతాదులో తీసుకోవడం వల్ల కూడా క్యాల్షియం ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది.
సరైన జీవన శైలిని అనుసరిస్తూ ఉంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజు వాకింగ్, రన్నింగ్ వంటి వాటిని అనుసరిస్తే మంచిది. దీనివల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.