త్వరలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు – హరీష్‌ రావు

-

త్వరలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో 1804 మందికి నూతన ఆసరా ఫెన్షన్ పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…. గతంలో ఫెన్షన్ ఇచ్చే దాక ఉంటారా సస్తారా తెలియదని… పెద్ద కొడుకులాగా కెసిఆర్ రూ. 2016 పెన్షన్ ఇస్తున్నారని కొనియాడారు.

పదిహేను రోజుల్లో దుబ్బాక వంద పడకల ఆసుపత్రిలో డయాలసిస్ ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. త్వరలో ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందిస్తామన్నారు.

బీజేపీ రక్తం పారియ్యాలని చూస్తే… బీడు భూముల్లో నీళ్లు పారియ్యాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పరిపాలన వదిలేసి, ప్రతిపక్షాలను వేధిస్తోందని మండిపడ్డారు. 8 రాష్టాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వలను పడగొట్టి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పాటు చేశారని… కేంద్రం పరిపాలన మర్చిపోయిందని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news