ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ కి రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సి కె కన్వెన్షన్ లో వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలతో ద్రౌపది ముర్ము సమావేశమవుతారు. సాయంత్రం ఐదు గంటలకు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు. ద్రౌపది ముర్ము కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసంలో తేనేటి విందు ఏర్పాటు చేయనున్నారు.
కాగా అదేరోజు(జూలై 12) మొదట హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ కి చేరుకుంటారు ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. ఇక ఒడిషాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నరుగా పనిచేసిన ముర్మూ రాజకీయాల్లో కిందిస్థాయి పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి చేరుకున్నారు.