ఆ బర్గర్‌ రుచి అచ్చం మనిషి మాంసంలానే ఉంటుందట.. తింటే అవార్డు ఇస్తారట..!

-

ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు. ఇంకా ఈ పిచ్చి తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడంలో అయితే ఇంకా ఉంటుంది. ఎవరికి వారు తమ ప్రొడెక్ట్సేహే తోపుతురుము అని యాడ్స్‌ ఇచ్చేసుకుంటాయి. ఒక్కోసారి అవే బొల్తాకొట్టి జరిమానాలు వేసే వరకూ వెళ్తాయి అనుకోండి అది వేరే విషయం. ఇక్కడ ఒక బర్గర్‌ కంపెనీ వింత బర్గర్‌ తయారు చేసి ప్రచారం చేసింది. ఈ బర్గర్‌ టేస్ట్‌ మానవ మాంసంలా ఉంటుందని చెప్పింది..

ఈ బర్గర్‌ తినేవారికి తినేవారికి అవార్డు కూడా అందిస్తుందట. ఆ బర్గర్ సంస్థ స్వీడన్లో ఉంది. ఇది మొక్కల ఆధారిత ఆహారాన్ని తయారుచేసి అమ్మే షాపు. గత ఏడాది హాలోవీన్ పండుగ సందర్భంగా మానవ మాంసం రుచి తెలుసుకోవాలని తహతహలాడే వారి కోసం బర్గర్ తయారు చేస్తామని ప్రకటించుకుంది. అలా ఇప్పడు మొక్కలతోనే మానవ మాంసం లాంటి రుచితో బర్గర్ తయారుచేసేసారు.

దేనితో తయారు చేశారు?

ఈ బర్గర్‌ను సోయా, పుట్టగొడుగులు, గోధుమలతో పాటూ ఒక రహస్యమైన మొక్కల ఆధారిత మసాలా మిశ్రమంతో తయారు చేశారట… దీనిలో నాన్ వెజ్ కాస్త కూడా కలవలేదు. కేవలం ఈ పదార్థంతోనే మనిషి మాంసం రుచి వచ్చేలా చేసినట్లు కంపెనీ చెబుతోంది.. మొక్కల ఆధారిత పదార్ధాలతోనే ఏ రకమైన ఆహారాన్ని అయినా చేయగలమని నిరూపించడమే తమ అంతిమ లక్ష్యం అని చెప్పారు ఆ సంస్థ యజమాని.

ప్రపంచంలోనే ఇది భయంకరమైన మొక్కల ఆధారిత ఆహారంగా చెప్తున్నారు నెటిజన్లు.. ఆ బర్గర్ ప్రకటన కూడా ఒకరకంగా భయానకంగా ఉంది. ఆ వాయిస్ ఓవర్, మ్యూజిక్ భయపెట్టేసేలా చేశారు. ఈ ప్రకటన చూశాక ఆ బర్గర్ ఎవరూ తినడానికి కూడా ధైర్యం చూపించరేమో! అసలు వెజ్‌తో చేసి మనిషి మాంసంలా ఉంటుందని చెప్పడమేంటి..? మనిషి మాంసం రుచి ఎలా ఉంటుందో వాళ్లకు ఎలా తెలుసు..? అసలు ఎవరైనా చికెనో, మటనో తినాలనుకుంటారు కానీ..పోయి పోయి మనిషి మాంసం తినాలనే కోరిక ఉంటుందా అని విషయం తెలిసిన నెజిజన్లు ప్రశ్నలమీద ప్రశ్నలు వేస్తున్నారు.!

Read more RELATED
Recommended to you

Latest news