బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తాగండి.. 10 రోజుల్లోనే రిజల్ట్..!!

-

సన్నగా ఉండాలని ఈరోజుల్లో అందరూ అనుకుంటారు. కానీ ఏం చేస్తాం.. ఎక్కడపడితే అక్కడ కొవ్వు పెరిగిపోతుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వును క‌రిగించ‌డానికి అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.. ఈ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించ‌డానికి ఆహార నియ‌మాల‌ను పాటించ‌డంతోపాటు డిటాక్సిఫికేష‌న్ డ్రింక్‌ల‌ను, హెల్తీ డ్రింక్‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇవి కూడా మ‌న బ‌రువు త‌గ్గ‌డానికి బాగా ప‌ని చేస్తాయి.

బ‌రువును త‌గ్గించే ఈ డ్రింక్‌ను ఇంట్లో ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

నాలుగు నిమ్మ‌కాయ‌ల‌ను, ఒక లీట‌ర్ నీటిని, ఒక టీ స్పూన్ న‌ల్ల ఉప్పు కావాలి..

వీటిని ముక్క‌లుగా కోసి ర‌సాన్ని అంతా తీసేసి నిమ్మ చెక్క‌ల‌ను ప‌క్క‌కు ఉంచాలి.

తరువాత ఒక గిన్నెలో నీళ్ల‌ను పోసి వేడి చేయాలి.

నీళ్లు వేడ‌య్యాక నిమ్మ చెక్క‌ల‌ను వేసి ఈ నీటిని 8 నుండి 10 నిమిషాల పాటు బాగా వేడి చేయాలి.

ఈ నీటిలో న‌ల్ల ఉప్పును వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న నీటిని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఇలా విధంగా త‌యారు చేసుకున్న ఈ డ్రింక్‌ను మూడు నుంచి నాలుగు గ్లాసుల ప‌రిమాణంలో ప్ర‌తి రోజూ మూడు పూట‌లా ఆహారం తీసుకున్న అర‌గంట త‌రువాత తీసుకోవాలి. ఈ విధంగా క్ర‌మం త‌ప్ప‌కుండా చేయ‌డం వ‌ల్ల 10 నుంచి 15 రోజుల్లోనే మ‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు.

తాగడం వల్ల లాభాలు..

ఈ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల పొట్ట‌తో పాటు ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రిగి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. అంతేకాకుండా ఈ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. చ‌ర్మం నిగారింపును సొంతం చేసుకుంటుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డుతుంది. పొట్ట‌లో గ్యాస్ స‌మ‌స్య కూడా తగ్గుతుంది.. ఈ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల గాయాలు, పుండ్లు వంటివి కూడా త్వ‌ర‌గా మానుతాయి. ఈ విధంగా స‌హ‌జసిద్ధ‌ ప‌దార్థాల‌తో త‌యారు చేసుకున్న ఈ డిటాక్సిఫికేష‌న్ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version