నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీ సమస్యలు ఉండవా..?

-

అశ్రద్ధ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తీసుకునే ఆహారం మొదలు వైద్య పరీక్షల వరకు దేనిలోనూ కూడా అశ్రద్ధ చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. ఇది ఇలా ఉంటే కిడ్నీలు నిజంగా మన శరీరంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకనే కిడ్నీలుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఉంది. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఇవి ముఖ్యమని నిపుణులు అంటున్నారు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

ఫిట్ గా ఉండడం:

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం చాలా మంచిది. రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావు. అదే విధంగా బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఇబ్బందులు రావు. కిడ్నీకి కూడా వ్యాయామం చాలా మంచిది. కాబట్టి తప్పకుండా కాస్త సమయాన్ని వ్యాయామం కోసం కేటాయించండి.

సరైన ఆహారం తీసుకోవడం:

మీరు తీసుకునే ఆహారం బట్టి ఆరోగ్యం ఉంటుంది. కనుక మంచి ఆహార పదార్థాలు తీసుకోండి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం తీసుకోవడం వల్ల ఏ సమస్య రాదు. అదేవిధంగా కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

మంచినీళ్లు ఎక్కువగా తాగడం:

కిడ్నీ సమస్యలు ఉంటే నిజంగా ఇబ్బందులు వస్తాయి. నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది కానీ అతిగా మాత్రం తాగద్దు. రోజుకి మీరు కనీసం ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగినట్టు చూసుకోండి అదే విధంగా యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా ఉండేలా చూసుకోండి. లేదా లైట్ ఎల్లో కలర్ లో వున్నా పరవాలేదు. ఒకవేళ కనుక మీ యూరిన్ ముదురు పసుపు రంగులో ఉంటే మీరు ఇంకా నీళ్లు తాగాలి అని అర్థం. కాబట్టి వీటిని తప్పకుండా చూసుకోండి.

రెగ్యులర్ చెకప్:

మీకు ఏమైనా సమస్య వున్నా లేదు అంటే ఇబ్బంది ఉన్నా డాక్టర్ ని కన్సల్ట్ చేయండి మీ సమస్యను తెలుసుకుని దానికి తగిన పరిష్కారం పొందండి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news