వేసవికాలంలో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో రకరకాల చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. వేసవికాలంలో ఎండవలన చాలా మంది చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు వస్తూ ఉంటాయి. వేసవిలో సూర్యుడి నుండి వచ్చే కిరణాలు మన మీద పడడం వలన రకరకాల సమస్యలు కలుగవచ్చు. చెమట కాయలు చర్మంపై దురద రావడం మంట మొదలైన సమస్యలు వేసవిలో కామన్ గా వస్తూ ఉంటాయి వేసవికాలంలో ఎక్కువగా వచ్చే వాటిలో దద్దుర్లు కూడా ఒకటి. ఇలాంటి దద్దుర్ల నుండి బయట పడాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి.
ఈ దద్దుర్లు వంటివి కలిగితే లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే వీడు వలన రకరకాల సమస్యలు తలెత్తుతాయి పైగా మంట వంటి వాటి వల్ల డిస్ కంఫర్ట్ గా ఉంటుంది అందుకని ఇలాంటి ర్యాషెస్ వంటివి వచ్చినప్పుడు ఈ ఈజీ చిట్కాలని ట్రై చేయండి. గంధం బాగా పనిచేస్తుంది గంధంతో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. వేసవిలో వచ్చే దద్దుర్ల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎర్రచందనం పేస్ట్ కానీ మామూలు చందనాన్ని కానీ మీరు తీసుకునే ఆ పొడిలో కొంచెం నీళ్లు రోజ్ వాటర్ వేసి సమస్య ఉన్న చోట అప్లై చేయండి ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇలా దీని నుండి బయటపడొచ్చు ఈ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ ఉండండి త్వరగానే తగ్గిపోతాయి.
కలబంద కూడా బాగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు యాంటీ మైక్రోబియన్ గుణాలు ఇందులో ఉంటాయి కూలింగ్ గుణాలు కూడా ఉంటాయి. కలబంద గుజ్జుని అప్లై చేసినా లేదంటే కలబంద ముక్కతో దద్దుర్ల పైన రుద్దినా సమస్య నుండి బయటపడొచ్చు. ముల్తానీ కూడా బాగా పనిచేస్తుంది ముల్తానీ కూడా దద్దుర్ల నుండి బయట పడేస్తుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి సమస్య ఉన్న చోట అప్లై చేయండి 20 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత కడిగేసుకుని నెమ్మదిగా ఐస్ ముక్కతో రబ్ చేయండి. కీర దోస లో ఫ్లెవనాయిడ్స్ ఉంటాయి కీర దోస కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కీరాని పేస్ట్ కింద చేసి అందులో తేనె రోజ్ వాటర్ వేసి 30 నిమిషాల పాటు వదిలేయండి శతావరి కూడా బాగా పనిచేస్తుంది సమస్యల నుండి బయట పడేస్తుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో దద్దుర్లకి చెక్ పెట్టేయండి.