ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..అయితే ఈపీ రాజకీయాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మారుస్తుందనే చెప్పాలి. ఇప్పుడు కేంద్రం సపోర్ట్ ఉన్నవారికే ఏపీలో అధికారం అనే పరిస్తితి నడుస్తోంది. అందుకే ప్రతి పార్టీ బిజేపితో సఖ్యతగా ఉండటానికి చూస్తున్నాయి. కానీ ఏపీకి బిజేపి చేసిన న్యాయం పెద్దగా లేదు. అయినా సరే రాజకీయంగా తమకు ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అని ప్రధాన పార్టీలు నోరు మెదపడం లేదు.
పైగా రాజకీయంగా మనగడానికి కేంద్రంతో అంటకాగుతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న జగన్…బీజేపీతో రహస్య మిత్రుత్వం కొనసాగిస్తున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఇక బిజేపి సైతం జగన్‌కు సపోర్ట్ చేస్తూనే వస్తుంది. ఇదే సమయంలో బిజేపికి దగ్గరవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కానీ గత అనుభవాలు, పొత్తులని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ బాబుతో కలవకూడదని బిజేపి అనుకుంటుంది. టిడిపితో పొత్తు వాళ్ళ బిజేపి బలపడటం లేదు. అదే సమయంలో జగన్ కు పరోక్షంగా సహకరించి..టిడిపిని తోక్కేసి.. ఆ స్థానంలో బలపడాలని బిజేపి చూస్తుంది.
కానీ అదే సమయంలో బిజేపితో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్..వైసీపీని గద్దె దించాలనే కసితో ఉన్నారు. అందుకు టిడిపితో కలిసి వెళ్లాలని చూస్తున్నారు. ఆ దిశగానే ఇటీవల ఢిల్లీకి వెళ్ళి బిజేపి పెద్దలతో మంతనాలు చేసినట్లు తెలిసింది. అయితే బిజేపి పెద్దలు టిడిపితో పొత్తు ఒప్పుకున్నట్లు కనిపించడం లేదు. ఇక ఇటీవలే మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బిజేపిలో చేరారు.
అయితే ఈయనకు..జగన్ అంటే పడదు..మొదట నుంచి వైఎస్ ఫ్యామిలీతో కాస్త విభేదాలే ఉన్నాయి. పైగా కిరణ్ సోదరుడు కిషోర్ టిడిపిలో ఉన్నారు. దీంతో కిరణ్..టిడిపితో బిజేపి-జనసేన పొత్తు సెట్ అయ్యేలా చూడవచ్చని ప్రచారం ఉంది. అంటే అటు పవన్, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి..టిడిపితో బిజేపి-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేలా చేయడానికి చూస్తారని తెలుస్తోంది. చూడాలి మరి చివరికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో.