సహజంగా ఆహారపు అలవాట్లను బట్టి మనిషి యొక్క బరువు ఆధారపడి ఉంటుంది. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ బరువు పెరిగే ముప్పు పొంచిఉంటుంది. 40ల్లోకి ప్రవేశించిన తర్వాత బరువు తగ్గే మార్గాల్లోనూ మార్పులు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. క్యాలరీలు తక్కువగా ఉండి విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉండే పండ్లను నిరభ్యంతరంగా తీసుకోవచ్చని వీటి ద్వారా జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గవచ్చు. పండ్లను రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే స్లిమ్‌గా మారవచ్చు. ఇక ప్రకృతి అందించిన అద్భుతమైన ఫలాలు బెర్రీస్ సైజ్‌లో చిన్నగా ఉన్నా వాటి ఆరోగ్య ప్రయోజనాలు మెండు. రస్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
రోజువారీ ఆహారంలో బెర్రీస్‌ను భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకర కొవ్వులు, ప్లాంట్ ప్రొటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండే తృణధాన్యాలు, సీడ్స్ అధికంగా తీసుకుంటే మేలని చెబుతున్నారు. ఇవి బీపీని అదుపులో ఉంచి హార్ట్ రేట్‌ను నియంత్రిస్తాయి. ఇక తక్కువ క్యాలరీలతో కూడిన అవకాడోలు బరువు తగ్గడంలో సాయపడతాయి. ఈ సూపర్ ఫుడ్ ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు. రోజూ అవకాడోలు తినడం ద్వారా ఆకలి పెరగడంఓ పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన అవిసె గింజలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అవిసె గింజల్లో అధిక ఫైబర్, ప్రొటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. 40 ఏండ్ల తర్వాత శరీరంలో మజిల్ మాస్ కోల్పోయే క్రమంలో జీవక్రియల వేగం కూడా మందగిస్తుంది. అయితే జీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడే ఆహార అలవాట్ల ద్వారా మెటబాలిజంను మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.