ముసలివాళ్ళలో ముడుతలు తగ్గించే పండు..

-

పండ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆహారంలో పండ్లని భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది. ఐతే అన్ని రకాల పండ్లు అన్ని కాలాల్లో దొరకవు. అందుకే సీజన్ లో దొరికే పండ్లని ఖచ్చితంగా తినాలని చెబుతుంటారు. ఐతే వేసవికాలం రాగానే అందరూ ఆశగా ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. మామిడి పండ్లు తినడానికి కొందరు, ఆవకాయ చేసుకోవడానికి మరికొందరు ఆసక్తిగా ఉంటారు.

ఐతే తాజా అధ్యయనంలో మామిడి పండ్లు తినడం వల్ల ముసలివాళ్ళలో ముడుతలు తగ్గుతున్నాయని తెలిసింది. అది కూడా కేవలం మహిళల్లోనేనట. వృద్ధ మహిళలు మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై ముడుతలు తగ్గుతున్నాయని పరిశోధన ద్వారా తెలుసుకున్నారు. చాంపేన్ మ్యాంగో లేదా హనీ మ్యాంగో రకాలని తినడం వల్ల వృద్ధ మహిళలో ముడుతలు తగ్గి చర్మం ఆరోగ్యంగా తయారవుతుందట.

ఈ మేరకు కాలిఫోర్నియా విశ్వ విద్యాలయం వారు చేపట్టిన పరిశోధనలో వారం రోజుల్లో నాలుగు సార్లు అరకప్పు మామిడి పండ్లని తీసుకోవడం వల్ల రెండునెలల్లో 23శాతం ముడుతలు తగ్గాయని తెలిసిందట. అలాగే నాలుగు నెలల పాటు తింటే 20శాతం ముడుతలు తగ్గాయట. ఈ పరిశోధన నిర్వహించడానికి మెనోపాజ్ దాటిన మహిళలని రెండు గ్రూపులుగా విభజించారట. ఒక గ్రూపు వారినేమో వారంలో నాలుగుసార్లు అరకప్పు మామిడి పండ్లు తీసుకోమన్నారు. మరో గ్రూపు వారినేమో రోజూ కప్పు మామిడి తీసుకోమన్నారు.

వారానికి నాలుగుసార్లు మామిడి పండ్లని తిన్నవారిలో ముడుతలు తగ్గాయి. అలాగే రోజూ తిన్నవారిలో ముడుతలు పెరిగినట్లు కనుగొన్నారు. అంటే ఎక్కువ తినడం వల్ల ముడుతలు తగ్గవని, తక్కువ తీసుకోవడం వల్లనే వృద్ధ మహిళల్లో ఫలితాలు కనిపించాయని కనుక్కున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news