దేవదాయ శాఖ అధికారులకు జగన్ బిగ్ షాక్ ఇచ్చారు. దేవదాయ శాఖలో నిబంధనలకు విరుద్దంగా బదిలీలపై కసరత్తు చేస్తోంది జగన్ సర్కార్. ఇందులో బాగంగానే జిల్లా అధికారుల బదిలీలు వద్దన్న నిబంధనకు విరుద్దంగా వ్యవహరిస్తోంది ఏపీ దేవదాయ శాఖ.
ఏలూరు, విశాఖ, రాజమండ్రి, కోనసీమ, నరసాపురం, కృష్ణా జిల్లాల దేవదాయ శాఖ అధికారుల బదిలీలపై తుది కసరత్తు చేస్తోంది. రూల్సుకు భిన్నంగా దేవాలయాల నుంచి జీతం తీసుకుంటున్న ఉద్యోగుల బదిలీలకు ప్రయత్నాలు చేస్తున్నాయని సమాచారం అందుతోంది.
దీంతో దేవదాయ శాఖలో అడ్డగోలు బదిలీలపై హైకోర్టుకు వెళ్లే యోచనలో దేవదాయ శాఖ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ఏపీ సిఎం జగన్ ఫైనల్ నిర్ణయం తీసుకొనట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం పారిస్ టూర్ లో ఉన్నారు. కుటుంబ సమేతంగా మొన్న పారిస్ టూర్ వెళ్లారు సిఎం జగన్.